Upasana: ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ తర్వాత ఉపాసన తొలి వెకేషన్‌.. థాయ్‌లాండ్‌లో రామ్‌చరణ్‌తో సందడి.

మెగా కుటుంబం నుంచి మూడవ తరం వస్తోందన్న వార్త అభిమానులను ఫుల్‌ ఖుషీ చేసిన విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ తండ్రి కాబోతున్నాడన్న చిరంజీవి ప్రకటించడంతో ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకున్నారు. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత ఉపాసన పుట్టింటికి వెళ్లిన విషయం తెలిసిందే...

Upasana: ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ తర్వాత ఉపాసన తొలి వెకేషన్‌.. థాయ్‌లాండ్‌లో రామ్‌చరణ్‌తో సందడి.
Upasana Ramcharan
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 19, 2022 | 5:55 PM

మెగా కుటుంబం నుంచి మూడవ తరం వస్తోందన్న వార్త అభిమానులను ఫుల్‌ ఖుషీ చేసిన విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ తండ్రి కాబోతున్నాడన్న చిరంజీవి ప్రకటించడంతో ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకున్నారు. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత ఉపాసన పుట్టింటికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ అందరితో ఆమె సరదగా గడుపుతూ.. వారి ఆశీస్సులు కూడా తీసుకుంది. జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నట్లు ఉపాసన తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రెగ్నెన్సీ తర్వాత రామ్‌ చరణ్‌తో కలిసి తొలిసారి కనిపించింది ఉపాసన. ప్రస్తుతం మెగా కపుల్ థాయ్‌లాండ్‌లో హాలీడే ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రామ్‌చరణ్‌తో పాటు పలువురు సన్నిహితులతో కలిసి బీచ్‌లో సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. భర్తతో పాటు పలువురు సన్నిహితులతో దిగిన ఫొటోలను ఉపాసన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రెగ్నెన్సీ తర్వాత తొలిసారి చెర్రీ, ఉపాసన కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

Upasana Instagram

ఈ ఫొటోలో రామ్‌ చరణ్‌, ఉపాసన జంట చూడముచ్చటగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్‌ చరణ్‌ శంకర్‌ చిత్రంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. షూటింగ్ మధ్య దొరికిన గ్యాప్‌లో చెర్రీ హాలీడే ఎంజాయ్‌ చేస్తున్నారు. ట్రిపులార్‌తో సంచలన విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్‌ తన తర్వాత చిత్రాన్ని కూడా అదే స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే థాయ్ లాండ్ టూర్ ను ముగించుకున్న మెగాకపుల్ సోమవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఈ జంటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైర్ అవుతోంది. ఇందులో చెర్రీ పూర్తిగా గడ్డంతో తలపై క్యాప్ తో డిఫ్రంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా