AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan Kushi: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. థియేటర్లలో సందడి చేయనున్న ఖుషీ. ఎప్పుడంటే..

ప్రస్తుతం సినిమాల రీరిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులకు ఊరుత్తలూగించిన చిత్రాలు ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా మార్పులతో మళ్లీ విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజై థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి...

Pawan Kalyan Kushi: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. థియేటర్లలో సందడి చేయనున్న ఖుషీ. ఎప్పుడంటే..
Kushi Movie Rereleasing
Narender Vaitla
|

Updated on: Dec 19, 2022 | 2:54 PM

Share

ప్రస్తుతం సినిమాల రీరిలీజ్‌ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులకు ఊరుత్తలూగించిన చిత్రాలు ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా మార్పులతో మళ్లీ విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజై థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన జల్సా చిత్రం థియేటర్లలో మళ్లీ విడుదలైన సందడి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా పవన్‌ హీరోగా తెరకెక్కిన మరో చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఆ సినిమా మరేంటో కాదు ఖుషీ.

తమిళ డైరెక్టర్ ఎస్‌జే సూర్య దర్శకత్వంలో భూమిక హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. 2001 ఏప్రిల్‌ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. అద్భుతమైన ప్రేమ కావ్యానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మణి శర్మ అద్భుత మ్యూజిక్ కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన దాదాపు 21 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ అందమైన ప్రేమను కథను ప్రేక్షకులు 4కే రిజల్యూషన్‌తో చూసే అవకాశం కల్పిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా ఖుషీ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయనున్నారు. 4కే స్క్రీన్‌ రిలజ్యూషన్‌తో పాటు 5.1 డాల్బీ ఆడియోలో సినిమాను విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా రీరిలీజ్‌ డేట్‌పై రెండు తేదీలు వినిపిస్తున్నాయి. ఒకటి డిసెంబర్‌ 31వ తేదీన సినిమాను ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. న్యూ ఇయర్ కి ఫ్యాన్స్ కు మేకర్స్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చారంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..