Anushka Shetty: భూత్‌కోలా వేడుకల్లో పాల్గొన్న అనుష్క.. నృత్యాన్ని వీక్షిస్తూ ఇలా..

ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది భూత్‌కోలా గురించి దైవ నర్తకుల గురించి తెలుసుకున్నారు.

Anushka Shetty: భూత్‌కోలా వేడుకల్లో పాల్గొన్న అనుష్క.. నృత్యాన్ని వీక్షిస్తూ ఇలా..
Anushka.
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 19, 2022 | 12:57 PM

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఈ సినిమాలో క‌ర్ణాట‌క సంస్కృతి, సంప్రదాయాల్లో భూత్‌కోలా.. దాని ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది భూత్‌కోలా గురించి దైవ నర్తకుల గురించి తెలుసుకున్నారు. ఈ సినిమా పై పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రిషబ్ శెట్టి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.  క్లైమాక్స్ లో  అతడి నటన థియేటర్స్ లో సీటు అంచున కూర్చో బెడుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కర్ణాటకలో భూత్‌కోలా వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సినీ నటి అనుష్క హాజరయ్యారు.

భూత్‌కోలా వేడుక‌ల్లో పాల్గొన్నారు అనుష్క. తన స్వస్థలం మంగుళూరులో జరిగిన వేడుకలకు సంప్రదాయ చీరకట్టులో హాజరయ్యారు. కళాకారుల నృత్యాన్ని వీక్షిస్తూ..తన ఫోన్‌లో ఆ దృశ్యాలను బంధిస్తూ కనిపించారు. ద‌క్షిణ క‌ర్ణాట‌క సంస్కృతి, సంప్రదాయాల్లో భూత్‌కోలా వేడుక‌లు చాలా ఫేమస్‌. ప్రస్తుతం మంగుళూరులో భూత్‌కోలా వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఆ వేడుకలకు హాజరైన అనుష్క..భూత్‌కోలా నృత్యాలను వీక్షించారు.

అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. నిశ్శబ్దం సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ఈ సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి
Anushka

Anushka