AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savitri: మంత్రి గారూ మీ తీరేం బాలేదు.. మహానటి గురించి అంత తప్పుగా ఎలా మాట్లాడతారు

మంత్రి గారు పరధ్యానంలో ఆ పదం ఉపయోగించారా..? లేక వేరే పదం అనబోయి.. ఆ పదం వాడారా...? దీనిపై ఆయన నుంచి స్పష్టత వస్తేనే బాగుంటుంది.

Savitri: మంత్రి గారూ మీ తీరేం బాలేదు.. మహానటి గురించి అంత తప్పుగా ఎలా మాట్లాడతారు
Savitri - Minister Botsa Satyanarayana
Ram Naramaneni
|

Updated on: Dec 19, 2022 | 4:11 PM

Share

మహానటి సావిత్రి.. కాదు కాదు సావిత్రి గారు. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగారు సావిత్రి గారు. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి డిగర్ తిలగం అనే బిరుదు పొందారు.  ఆమె గొప్ప నటి అని అందరికీ తెల్సు. ఆమె నిజ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కుందో మాత్రం మహానటి సినిమా ద్వారా ప్రపంచానికి చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఎప్పుడూ ఒకరికి ఇచ్చే గుణం తప్ప.. చేయి చాపే గుణం కాదు ఆమెది. చాలామంది చేతుల్లో మోసపోయింది.

ఎన్నో సిరిసంపదలు సంపాదించి కూడా.. జీవిత చరమాంకంలో దుర్భర జీవితాన్ని అనుభవించింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది. తెలుగునాట పుట్టిన అరుదైన వ్యక్తిత్వం, ప్రతిభ ఉన్న మహిళ సావిత్రి గారు. ఆవిడను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అవమానకర రీతిలో సంభోదించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఏపీకి  సినిమా యాక్టర్లు ఎవరు వచ్చినా చూసేందుకు జనం వస్తారని బొత్స పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వచ్చినప్పుడు రావడంలో గొప్ప ఏముందని.. ఎవరు వచ్చినా జనం వస్తారని విమర్శించే క్రమంలో ఉదాహారణగా సావిత్రి గారి పేరును తీసుకున్నారు. ఆమె పేరుకు ముందు చెప్పరాని, రాయరాని ఒక పదాన్ని వాడారు. దీంతో సావిత్రి అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిపై నెట్టింట విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి  పరధ్యానంలో ఆ మాట అని ఉండవచ్చు. తర్వాత అయినా రియలైజ్ అయ్యి.. ఆ పదం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినా.. క్షమాపణలు చెప్పినా హుందాగా ఉండేదన్నది మరికొందరి వెర్షన్.

మరిన్ని ఏపీ వార్తల కోసం..