మూవీ టైటిల్ లోగోను విడుదల చేసిన బ్రహ్మాస్త్ర టీం
బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ టైటిల్ లోగోను చిత్రబృందం విడుదల చేసింది. అన్ని అస్త్రాలకు దేవత ఈ బ్రహ్మాస్త్ర అంటూ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్జ. ఈ లోగో ప్రముఖ హాలీవుడ్ చిత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోగోను తలపిస్తోంది. ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమా లోగోను ప్రయాగ వద్ద జరిగిన కుంభమేళాలో ఆవిష్కరించారు. డ్రోన్లను అమర్చి ఆకాశంలో బ్రహ్మాస్త్ర […]
బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ టైటిల్ లోగోను చిత్రబృందం విడుదల చేసింది. అన్ని అస్త్రాలకు దేవత ఈ బ్రహ్మాస్త్ర అంటూ వీడియోను విడుదల చేసింది చిత్రయూనిట్జ. ఈ లోగో ప్రముఖ హాలీవుడ్ చిత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోగోను తలపిస్తోంది.
ఇప్పటికే బ్రహ్మాస్త్ర సినిమా లోగోను ప్రయాగ వద్ద జరిగిన కుంభమేళాలో ఆవిష్కరించారు. డ్రోన్లను అమర్చి ఆకాశంలో బ్రహ్మాస్త్ర లోగోను రివీల్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం.. బ్రహ్మాస్త్ర లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అయాన్ ముఖర్జీ పాల్గొన్నారు.