Sridevi: సతీమణిని గుర్తు చేసుకున్న బోనీ కపూర్‌.. అతిలోక సుందరి 34 ఏళ్ల నాటి ఫొటో వైరల్‌..

తన అందం, అభినయంతో టాలీవుడ్‌లోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. అభిమానుల మదిలో 'అతిలోక సుందరి'గా గుర్తుండిపోయిన ఆమె బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడింది

Sridevi: సతీమణిని గుర్తు చేసుకున్న బోనీ కపూర్‌..  అతిలోక సుందరి 34 ఏళ్ల నాటి ఫొటో వైరల్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2021 | 8:01 PM

తన అందం, అభినయంతో టాలీవుడ్‌లోనే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి. అభిమానుల మదిలో ‘అతిలోక సుందరి’గా గుర్తుండిపోయిన ఆమె బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత జాన్వీకపూర్‌, ఖుషి కపూర్‌లకు అమ్మగా మారింది. తన పెద్ద కూతరును సిల్వర్‌ స్ర్కీన్‌పై చూడాలన్న కోరిక తీరకుండానే మూడేళ్ల క్రితం అకాల మరణం చెందింది. అయితే అతిలోక సుందరి లేని లోటును తీర్చేందుకు ఆమె కూతురు జాన్వీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. త్వరలో చిన్న కూతురు ఖుషీ కూడా వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ఆమె భర్త బోనీ కపూర్‌ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తుంటారు. అలా తాజాగా మరొక ఫొటోను పంచుకున్నాడు.

ఈక్రమంలో శ్రీదేవితో మొదటిసారిగా కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు ఆమె భర్త. ‘ నా సతీమణి శ్రీదేవితో దిగిన మొదటి ఫొటో..ముంబైలోని నటరాజ్ స్టూడియోలో 1984 సెప్టెంబర్‌లో ఈ ఫొటో తీసుకున్నాను ‘ అని అందులో రాసుకొచ్చారు. కాగా బోనీ కపూర్ టాలీవుడ్‌తో సహా బాలీవుడ్‌లో పలు సినిమాలను నిర్మించారు. గతేడాది విడుదలైన పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గతంలో అజిత్ హీరోగా నటించిన ‘నెర్కొండ పారవై’ (పింక్‌ తమిళ రీమేక్‌) సినిమాకు ఆయనే ప్రొడ్యూసర్‌. ప్రస్తుతం మళ్లీ అజిత్‌తోనే ‘వాలిమై’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు నటుడు కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

Also Read:

RRR Movie: ముంబైకి భారీగా తరలివెళ్తున్న తారక్- చరణ్ ఫ్యాన్స్.. కారణం ఇదే..

Sudigaali Sudheer: జబర్దస్త్ నుంచి కాదు.. ఆ షో నుంచి సుడిగాలి సుధీర్ అవుట్..

Pushpa MASSive Pre Release Party LIVE: తగ్గేదే లే అంటున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.. తండోపతండాలుగా ఈవెంట్‌కి..