RRR Movie: ముంబైకి భారీగా తరలివెళ్తున్న తారక్- చరణ్ ఫ్యాన్స్.. కారణం ఇదే..

ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా కబుర్లే.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

RRR Movie: ముంబైకి భారీగా తరలివెళ్తున్న తారక్- చరణ్ ఫ్యాన్స్.. కారణం ఇదే..
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2021 | 6:30 PM

RRR Movie: ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా కబుర్లే.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న సినిమాలావర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ఖండాలు దాటించిన ఘనుడు రాజమౌళి. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా పై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజయ్యాక.. ఎలాఉన్నా రికార్డులు బద్దుల కొట్టడం.. కలెక్షన్ల సునామి సృష్టించడం కన్ఫామ్.

ఇదిలా ఉంటే విడుదల దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు జక్కన్న ఈక్రమంలోనే ట్రైలర్ రిలీజ్ చేసి అన్ని భాషల్లో ఇంట్రవ్యులు ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ పై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను పలు భాషల్లో గ్రాండ్ గా నిర్వహించనున్నాడట జక్కన్న. ఈ క్రమంలో ముందుగా  హిందీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరపనున్నారట, ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఎన్టీఆర్ – రామ్ చరణ్ లకు చెందిన 3000 మంది అభిమానులు ముంబైకి వెళుతున్నారని తెలుస్తుంది. రెండు రైళ్లలో ఏకంగా ముంబైకి 3000 మంది తెలుగు అభిమానులు ప్రయాణమవుతుండడం సంచలనంగా మారింది.  తెలుగు రాష్ట్రాలనుంచి తారక్, చరణ్ అభిమానులు భారీగా ముంబై వెళ్తున్నారట. ముంబై ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారట.. ఇక మనదగ్గర ఈ ఈవెంట్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hebah Patel: అందంతో ఆకట్టుకుంటున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

Suma Kanakala: మెరిసిపోతున్న బుల్లితెర స్టార్ మహిళ సుమ.. ‘జయమ్మ’ లేటెస్ట్ ఫోటోలు..

Ankita Lokhande: పెళ్లి పీటలెక్కనున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. వైరల్‌గా ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఫొటోలు..