Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigaali Sudheer: జబర్దస్త్ నుంచి కాదు.. ఆ షో నుంచి సుడిగాలి సుధీర్ అవుట్..

Sudigali Sudheer: కష్టపడి పనిచేస్తే.. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చని నిరూపించిన వ్యక్తుల్లో ఒకరు సుడిగాలి సుధీర్..

Sudigaali Sudheer: జబర్దస్త్ నుంచి కాదు.. ఆ షో నుంచి సుడిగాలి సుధీర్ అవుట్..
Comedian Sudigali Sudheer
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2021 | 6:29 PM

Sudigaali Sudheer: కష్టపడి పనిచేస్తే.. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చని నిరూపించిన వ్యక్తుల్లో ఒకరు సుడిగాలి సుధీర్.. నటుడిగా ఎగదలనే తపనతో చేస్తున్న ఉద్యోగాన్నీ వదులుకుని.. నటుడిగా అవకాశాల కోసం అనేక అష్టకష్టాలు పడ్డాడు. తినడానికి తిండి లేక కుళాయి నీళ్ళు తాగేవాడు… అటువంటి స్టేజ్ లో  ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారం మవుతున్న జబర్దస్త్ లో అవకాశం అందుకున్నాడు.

జబర్దస్త్ షో స్టార్ట్ అయినప్పుడు సుడిగాలి సుధీర్ అడుగు పెట్టాడు.. తనదైన స్టైల్ లో స్కిట్స్  చేస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులను అలరించాడు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలతో సుడిగాలి సుధీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాగా పాపులర్ అయ్యాడు. అనంతరం సినిమాల్లో కూడా పలు అవకాశాలు అందుకున్నాడు. అయితే సుడిగాలి సుధీర్ నటనతో ఎంత పాపులర్ అయ్యాడో.. అంతకంటే ఎక్కువగా యాంకర్ రష్మీ తో ఎఫైర్ అంటూ వచ్చే వార్తలతో మరింత పాపులర్ అయ్యాడు.

సుధీర్ జబర్దస్త్ కామెడీ షోల్లో చేస్తూనే.. ఢీ డాన్స్ షోలో ఒక మెంటర్ గాను, శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గాను బుల్లి తెరపై పలు అవకాశాలను అందుకున్నాడు. తాజాగా సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడంటూ టాక్ వినిపించింది. ఈ వార్తలపై సుధీర్ స్పందిస్తూ.. తాను జబర్దస్త్ ను వీడడంలేదని.. మరింతగా నవ్వించాలంటూ ఫిక్స్ అయ్యామని చెప్పారు. అయితే ఇపుడు సుధీర్ జబర్దస్త్ నుంచి కాదు.. ఢీ షో నుంచి అవుట్ అయినట్లు తెలుస్తోంది. హైపర్ ఆది తో కలిసి మెంటర్ గా వ్యవహరించిన సుధీర్ ఢీ డాన్స్ 13th కింగ్స్ vs క్వీన్స్ కు మంచి హైప్ తీసుకొచ్చారు. అయితే ఢీ 14 కి మాత్రం సుధీర్ మిస్ అయ్యాడు. సుధీర్ ప్లేస్ లో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ కనిపిస్తున్నాడు. ఢీ డాన్స్ షో లో ఆది తో పాటుగా అఖిల్ మెంటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. సుడిగాలి సుధీర్ తనకు సినిమాల్లో వస్తున్న అవకాశాలతో ఢీ షో నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి సుధీర్ ప్లేస్ లో అఖిల్ ఎలా అలరిస్తాడో .. ఆది తో కలిసి ఏ విధంగా సందడి చేస్తాడో చూడాలి మరి.

Also Read:  ఆర్ఆర్ఆర్ మూవీ భారీ ధరకు డిజిటల్ రైట్స్ .. ఓటిటిలో ప్రసారమయ్యేది ఎప్పుడంటే..