Ankita Lokhande: పెళ్లి పీటలెక్కనున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. వైరల్‌గా ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఫొటోలు..

ప్రస్తుతం బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. మొన్న రాజ్‌కుమార్‌ రావ్‌ - పత్రలేఖ.. నిన్న కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌.. ఇప్పుడు అంకితాలోఖండే- విక్కీజైన్‌. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అంకిత- విక్కీలు మరి కొన్ని గంటల్లో

Ankita Lokhande: పెళ్లి పీటలెక్కనున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. వైరల్‌గా ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఫొటోలు..
Follow us
Basha Shek

|

Updated on: Dec 12, 2021 | 3:22 PM

ప్రస్తుతం బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. మొన్న రాజ్‌కుమార్‌ రావ్‌ – పత్రలేఖ.. నిన్న కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌.. ఇప్పుడు అంకితాలోఖండే- విక్కీజైన్‌. గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న అంకిత- విక్కీలు మరి కొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 14న ముంబయిలోని గ్రాండ్ హయత్‌ హోటల్‌ ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు వేదిక కానుంది. వేడుకల్లో భాగంగా నేటి(డిసెంబర్‌) నుంచే ప్రి వెడ్డింగ్‌ కార్యక్రమాలు జరగనున్నాయి. మహారాష్ట్ర సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరగనుంది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది. అయితే వివాహం అనంతరం బాలీవుడ్‌ ప్రముఖుల కోసం డిసెంబర్‌ 14న గ్రాండ్‌గా రిసెప్షన్‌ పార్టీ ఏర్పాటుచేయనున్నారు.

‘మణికర్ణిక’, ‘భాఘీ’ సినిమాల్లో మెరిసిన అంకిత అంతకుముందు పలు బాలీవుడ్‌ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా దివంగత నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి ఆమె నటించిన ‘పవిత్ర రిష్తా’ సీరియల్‌ బాలీవుడ్‌ బుల్లితెరపై ఓ సంచలనం. ఈ సీరియల్‌ చిత్రీకరణ సమయంలోనే సుశాంత్‌- అంకితలు ప్రేమలో పడ్డారు. సుమారు ఆరేళ్లపాటు ఈ ప్రేమ బంధం కొనసాగింది. అయితే ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఈ క్రమంలోనే గత ఏడాది సుశాంత్‌ ఆత్మహత్య సమయంలో అంకితా పేరు కూడా బాగా వినిపించింది. ఇక సుశాంత్‌ బ్రేకప్‌ తర్వాత మరో బాలీవుడ్‌ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది అంకిత. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పెద్దల అనుమతితో పెళ్లిపీటలెక్కుతున్నారు. కాగా అంకిత- విక్కీల ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే వధూవరులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read:

Jayamma Panchayathi : రెండ్రోజుల్లో తేల్చకపోతే పంచాయితీ ఉండదు.. పెద్దలు ఉండరు!.. “జయమ్మ పంచాయితీ”

Akhanda: 100 కోట్ల ‘అఖండ’.. కలెక్షన్లతో సింహగర్జన చేస్తోన్న బాలయ్య.. షేకయిన బాక్సాఫీస్

రజనీకాంత్ కోట్ల ఆస్తులకు యజమాని.. ఒక్క సినిమాకి ఎంత వసూలు చేస్తాడో తెలుసా?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!