AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa MASSive Pre Release Party Highlights: డిసెంబర్ 17న థియేటర్లో తగ్గేదే లే.. దుమ్ము లేవాల్సిందే: అల్లు అర్జున్

సుకుమార్ క్రియేటివిటీకి బన్నీ మాస్ యాక్టింగ్ తోడైతే ఎలా ఉంటుంది... పుష్ప లా ఉంటుంది. పుష్ప సినిమాకోసం బన్నీ ఆర్మీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa MASSive Pre Release Party Highlights: డిసెంబర్ 17న థియేటర్లో తగ్గేదే లే.. దుమ్ము లేవాల్సిందే: అల్లు అర్జున్
Pushpa
Rajeev Rayala
|

Updated on: Dec 13, 2021 | 6:40 AM

Share

Pushpa MASSive Pre Release Party Highlights: సుకుమార్ క్రియేటివిటీకి బన్నీ మాస్ యాక్టింగ్ తోడైతే ఎలా ఉంటుంది… పుష్ప లా ఉంటుంది. పుష్ప సినిమాకోసం బన్నీ ఆర్మీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమానుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్స్, సాంగ్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. ఇక రంగస్థలం సినిమాతర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా.. అలవైకుంఠపురం సినిమాతర్వాత బన్నీ చేస్తున్న నేపథ్యంలో పుష్ప పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సుకుమార్ , బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పుష్ప ప్రీరీలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hebah Patel: అందంతో ఆకట్టుకుంటున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

Suma Kanakala: మెరిసిపోతున్న బుల్లితెర స్టార్ మహిళ సుమ.. ‘జయమ్మ’ లేటెస్ట్ ఫోటోలు..

Ankita Lokhande: పెళ్లి పీటలెక్కనున్న సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి.. వైరల్‌గా ప్రి వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఫొటోలు..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Dec 2021 11:01 PM (IST)

    అఖండకు ప్రత్యేక శుభాకాంక్షలు: బన్నీ

    చాలా రోజుల తరువాత థియేటర్లో పండుగ వాతావరణం అందించిన అఖండ టీంకు ధన్యవాదాలు. అలాగే డిసెండర్ 17న మేం కూడా అలానే సందడి చేయబోతున్నాం. ముందుముందు విడుదల కాబోయే సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్ అంటూ అల్లు అర్జున్ తన స్పీచ్‌ను ముగించారు.

  • 12 Dec 2021 10:58 PM (IST)

    ఆయన రావడం లేదంటే నేను స్టక్ అయినట్లంది: అల్లు అర్జున్

    లాస్ట్ అవర్ వరకు వారు చాలా కష్టపడుతున్నారు. ఈ రోజు ఈ ఫంక్షన్‌కు రాకపోవడంలో వేరే ఉద్దేశ్యం లేదు. మీ కోసం సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దున్నారు. మేం ముగ్గురు(సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్, అల్లు అర్జున్) కలిసి ఎంతో దూరం ప్రయాణించాం. అలానే మా జర్నీ కొనసాగుతుంది.

  • 12 Dec 2021 10:53 PM (IST)

    సమంతాకు స్పెషల్ థాంక్స్: అల్లు అర్జున్

    ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ చేసిన సమంతాకు ధన్యవాదాలు. మేం ఏం అడిగినా అలానే చేసి ఆ సాంగ్‌ను అంతే బాగా చేసింది. మీరు థియేటర్లో చాలా ఎంజాయ చేస్తారంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

  • 12 Dec 2021 10:50 PM (IST)

    నేషనల్ ‘క్రష్మిక’: అల్లు అర్జున్

    ముద్దుగా రష్మికను క్రష్మిక అని పిలుస్తుంటాం. నా మనసుకు నచ్చిన అమ్మాయి రష్మిక. చాలా టాలెంట్‌ ఉన్న నటీమణుల్లో రష్మిక ఒకరు. రాబోయే రోజుల్లో టాప్‌లో ఉండనుంది.

  • 12 Dec 2021 10:46 PM (IST)

    ఏం దబ్బా ఎట్టా ఉండారు: అల్లు అర్జున్

    ఈవెంట్ చివర్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తన మాటలతో అభిమానులను హుర్రూతలూగించారు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. మీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు అంటూ తన అభిమానుల గురించి మాట్లాడారు. దేవీ, నేను కలిసి మూడో డెకెట్‌లో ప్రయాణిస్తున్నాను. ఒక్కో పాటను పాడుతూ, చిన్న స్టెప్పులతో పోడియంను దడదడలాడించాడు.

  • 12 Dec 2021 10:28 PM (IST)

    బన్నీసార్ ఐ లవ్‌ యూ: రష్మికా

    డిసెంబర్ 17న మేమంతా మీముందుకు రాబోతున్నాం. ఈ సినిమాకు నా కోసం కూడా 5 నుంచి 8 శాతం మంది కూడా వస్తారని ఆశిస్తున్నాను అంటూ సినిమాలో తన ప్రయాణాన్ని వివరించింది. చివర్లో సినిమాలోని తన డైలాగ్‌ను చెప్పి సందడి చేసింది.

  • 12 Dec 2021 10:19 PM (IST)

    రెండేళ్లకు ఒక్కసారి జరిగే అద్భుతం సుకుమార్: అల్లు అరవింద్

    రెండేళ్లకు ఒక్కసారి జరిగే అద్భుతం సుకుమార్ అంటూ అల్లు అర్జున్, దేవీ శ్రీ ప్రసాద్, రష్మికాను పొగుడుతూ ఓ కవితను అల్లు అభిమానులకు వినిపించారు.

  • 12 Dec 2021 10:14 PM (IST)

    ఇలాంటి పాత్రలు సుక్కూకు మాత్రమే సాధ్యం: కొరటాల శివ

    మైత్రీ మూవీ మేకర్స్‌.. సినిమా అంటే ఫ్యాషన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఎన్నో సినిమాలో ఇంకా చేయాలి. డీ గ్లామరస్ పాత్రలోనూ చాలా అందంగా కనిపించింది.నేను ఆయనకో పెద్ద ఫ్యాన్‌ని. భారతదేశంలోనే సినిమాకు నుంచి సినిమాకు ఎంతో తేడాను చూపిస్తూ ఎదుగుతున్నాడు. ఇలాంటి పాత్రలకోసం ప్రాణం పెట్టే వాళ్లు ఉండరు.

  • 12 Dec 2021 09:37 PM (IST)

    అల్లు అర్జున్ గారిని అడగాన్నే ఛాన్స్ ఇచ్చారు: అనసూయ

    అమ్మానాన్నల్ని.. దేవుడిని కోరికలు అడుగుతారు, కానీ నేను అల్లు అర్జున్ గారిని అడిగాను మీతో చేయాలని .. వెంటనే ఫోన్ వచ్చింది అని అన్నారు అనసూయ. మరిన్ని సినిమాలు బన్నీ సార్ తో చేయాలనీ అనుకుంటున్నా అన్నారు అనసూయ. రంగమ్మత్త లాంటి ఆ కెరీర్ కు ప్లస్ అయినా రోల్ ఇచ్చిన సుకుమార్ గారికి ధన్యవాదాలు అని అన్నారు అనసూయ. రానున్న రోజుల్లో నన్ను సునీల్ గారిని చాలా సినిమాల్లో చూడబోతున్నారు అని అన్నారు అనసూయ.

  • 12 Dec 2021 09:32 PM (IST)

    నన్ను కొత్తగా చుడండి: సునీల్

    పుష్ప సినిమాలో సునీల్ నెగిటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో ఆయనని కొత్తగా ఫ్రెష్ గా చూడాలని అన్నారు సునీల్. కమెడియన్ గా కాకుండా హీరోగా కాకుండా నన్ను కొత్తగా చూడండి అని అన్నారు సునీల్.

  • 12 Dec 2021 09:29 PM (IST)

    విలన్ అవ్వాలన్న కోరిక ఇన్నాళ్టికి తీరింది: సునీల్

    ఇదే ప్లేస్లో నిలుచొని అల వైకుంఠపురంలో సినిమా టైంలో చెప్పా సినిమా పెల్లిభోజనంలా ఉంటుంది అన్నాను. ఇప్పుడు ఈ సినిమా పెళ్లితర్వాత దావత్ లా ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఒక వారం రోజులు ప్రతి పాత్ర మిమల్ని వెంటాడతాయి.. విలన్ అవ్వాలన్న నాకోరికను తీర్చిన సుకుమార్ కు, బన్నీకి చాలా థ్యాంక్స్..  నన్ను కొత్తగా చూడండి ఈ సినిమాలో అన్నారు సునీల్..

  • 12 Dec 2021 08:56 PM (IST)

    చాలా మందికి బన్నీ ఆదర్శం: రాజమౌళి

    సినిమా అద్భుతం‌గా వస్తుందని అన్నారు రాజమౌళి.. ఇతరరాష్ట్రాల్లో అందరు ఎదురుచూస్తున్న సినిమా పుష్ప.. అందరు నన్ను అడుగుతున్నారు పుష్ప సినిమా గురించే.. పుష్ప సినిమా అందరి సినిమా అన్నారు రాజమౌళి. ట్రైలర్ అదిరిపోయింది. విజువల్స్ అదిరిపోయాయి.. ఫైట్స్ కూడా అదిరిపోయాయి. ఫ్యాన్స్ పిచ్చెక్కేలా చేశారని అన్నారు రాజమౌళి. బన్నీ పడే కష్టానికి, డైరెక్టర్ మీద పెట్టె నమ్మకానికి హ్యాట్సాఫ్ అన్నారు రాజమౌళి. చాలా మందికి బన్నీ ఆదర్శం అన్నారు జక్కన్న

  • 12 Dec 2021 08:49 PM (IST)

    స్టేజ్ పై సందడి చేసిన అర్హ , అయాన్

    పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్స్ గా బన్నీ పిల్లలు, అల్లు అర్హ, అల్లు అయాన్

  • 12 Dec 2021 08:47 PM (IST)

    ప్రతి దర్శకుడు బన్నీతో చేయాలను చూస్తారు: వెంకీ కుడుముల

    ప్రతి దర్శకుడు అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ చూస్తుంటారు అని వెంకీ కుడుముల అన్నారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అన్నారు వెంకీ..

  • 12 Dec 2021 08:45 PM (IST)

    పుష్పరాజ్ ను ఎవ్వరూ మర్చిపోలేరు: బుచ్చిబాబు

    సినిమా చుసిన తర్వాత పుష్పరాజ్ ను ఎవ్వరూ మర్చిపోలేరు అని బుచ్చిబాబు అన్నారు. సినిమా సూపర్ గా వచ్చిందన్నారు ఉప్పెన దర్శకుడు.

  • 12 Dec 2021 08:44 PM (IST)

    హాజరుకానీ సుకుమార్..

    పుష్ప మిక్సింగ్ కోసం ముంబై లో ఉన్న సుకుమార్.. ఈవెంట్ కు హాజరు కాలేకపోయారు సుకుమార్..

  • 12 Dec 2021 08:42 PM (IST)

    పుష్ప రాజ్ ఎంట్రీ..

    అల్లు అర్జున్ ఎంట్రీతో హోరెత్తిన పోలీస్ గ్రౌండ్.. బన్నీ బన్నీ నినాదాలతో మారుమ్రోగింది గ్రౌండ్..

  • 12 Dec 2021 08:39 PM (IST)

    గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బన్నీ..

    స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

  • 12 Dec 2021 08:36 PM (IST)

    ప్రత్యేక అతిథిగా హాజరైన కొరటాల..

    పుష్ప ఈవెంట్ కు ప్రత్యేక అతిథులుగా హాజరైన కొరటాల శివ, మారుతి, రాజమౌళి, బుచ్చి బాబు సన, వెంకీ కుడుములు

  • 12 Dec 2021 08:31 PM (IST)

    ఎంట్రీ ఇచ్చిన లక్కీ బ్యూటీ..

    బ్లాక్ డ్రస్ లో అందంగా ఎంట్రీ ఇచ్చింది అందాల రష్మిక మందన్న..

  • 12 Dec 2021 08:29 PM (IST)

    ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి..

    పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి, మారుతి

  • 12 Dec 2021 08:28 PM (IST)

    ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన..

    పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన ఎంట్రీ ఇచ్చింది. గేయ రచయిత చంద్రబోస్, సుమ ఆమెకు స్వాగతం పలికారు.

  • 12 Dec 2021 08:08 PM (IST)

    సిరివెన్నెలకు నివాళి..

    ఇటీవల కన్నుమూసిన గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని మరోసారి గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా వివిధ సినిమాల్లో ఆయన ఆలపించిన హిట్ పాటలతో ఓ అద్భుతమైన వీడియోను రూపొందించి ఆడియన్స్ తో పంచుకుంది.

  • 12 Dec 2021 07:56 PM (IST)

    ఈవెంట్ కు హాజరైన సునీల్..

    పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరయిన సునీల్.. పుష్ప సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించనున్న సునీల్..

  • 12 Dec 2021 07:33 PM (IST)

    హాజరైన సుకుమార్..

    క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.. సుకుమార్‌తోపాటు చంద్రబోస్ కూడా హాజరయ్యారు.

  • 12 Dec 2021 07:31 PM (IST)

    జై బన్నీ నినాదాలతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్..

    జై బన్నీ నినాదాలతో హోరెత్తిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్.. అభిమానులతో నిండిపోయిన పోలీస్ గ్రౌండ్..

  • 12 Dec 2021 07:25 PM (IST)

    హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుమ..

    పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సుమ కనకాల..

  • 12 Dec 2021 07:14 PM (IST)

    కంట్రోల్ చేయలేక పోలీసుల తిప్పలు..

    తండోపతండాలుగా వచ్చిన బన్నీ ఫ్యాన్స్.. అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్న పోలీసులు..

  • 12 Dec 2021 07:00 PM (IST)

    భారీగా వచ్చిన బన్నీ ఆర్మీ..

    పుష్ప ప్రీరిలీజ్ ఈవెంట్ కు భారీగా తరలి వచ్చిన అభిమానులు.. బన్నీ ఫ్యాన్స్ తో నిండిపోయిన పోలీస్ గ్రౌండ్..

  • 12 Dec 2021 06:58 PM (IST)

    బన్నీ అభిమానుల రచ్చ..

    ప్రీరిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.. బ్యారిగేట్లు పైకి ఎక్కుతున్న అభిమానులు..

  • 12 Dec 2021 06:51 PM (IST)

    బన్నీ పాటలతో ఆకట్టుకుంటున్న సింగర్స్…

    అల్లు అర్జున్ సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ తో ఆకట్టుకుంటున్న సింగర్స్..

  • 12 Dec 2021 06:44 PM (IST)

    సోషల్‌ మీడియాలో రికార్డుల వేట…

    తగ్గేదేలే అంటూ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో రికార్డులు సెట్‌ చేస్తూనే ఉన్నాయి పుష్ప పాటలు, టీజర్.

  • 12 Dec 2021 06:31 PM (IST)

    లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా బన్నీ…

    డ్రైవర్ పుష్పరాజ్‌గా బన్నీ… పల్లెటూరి శ్రీవల్లిగా రష్మిక మందన… స్పెషల్‌ సాంగ్‌లో ఊ అంటారా అంటూ సమంత.. విలన్లుగా మలయాళం నుంచి ఫాహద్‌ ఫాజిల్‌, మన సునీల్‌, కన్నడ నుంచి ధనుంజయ…

  • 12 Dec 2021 06:06 PM (IST)

    సుకుమార్‌ మాస్టర్‌ ఇంటలిజెన్స్..

    సుకుమార్‌ మాస్టర్‌ ఇంటలిజెన్స్ కి, మాస్‌ మేనియా, అల్లు అర్జున్‌ ఐకానిక్‌ అప్రోచ్‌ యాడ్‌ అయితే బొమ్మ దద్దరిల్లిపోతుందనే విషయాన్ని స్ట్రాంగ్‌గా చెప్తున్నారు ఆర్టిస్టులు అండ్‌ టెక్నీషియన్లు.

  • 12 Dec 2021 06:03 PM (IST)

    స్టైలిష్ స్టార్‌ నుంచి ఐకాన్ స్టార్‌గా..

    స్టైలిష్ స్టార్‌ నుంచి ఐకాన్ స్టార్‌గా ట్రాన్స్‌ఫామ్ అయ్యాక… బన్నీ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ పార్ట్ … తెలుగు సహా ఈనెల 17న ఐదు భాషల్లో రిలీజవుతోంది.

  • 12 Dec 2021 06:01 PM (IST)

    తగ్గేదేలే అంటున్న పుష్పరాజ్

    ఈసారి మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా మూవీస్‌ ఎన్నయినా వుండొచ్చు.. మేం మాత్రం తగ్గేదేలే అని గట్టిగానే చెప్పేశాడు పుష్పరాజ్.

  • 12 Dec 2021 06:00 PM (IST)

    స్పెషల్‌ అట్రాక్షన్‌ గా సమంత

    సమంత స్పెషల్‌ అట్రాక్షన్‌ అయ్యేసరికి ఆర్గానిక్‌ వ్యూస్‌ కూడా ఈ మాస్ పాటకు అదే రేంజ్‌లో ఊ అంటున్నాయి..

  • 12 Dec 2021 05:59 PM (IST)

    ఊ అంటావా మావా ఉఊ అంటావా మామ

    అల్లు అర్జున్‌తో ఒకటో సారి, రెండో సారి కూడా స్పెషల్‌గా సక్సెస్‌ అయిన మాస్టర్‌ ఈసారి ఊరుకుంటారా ఊ అంటావా మావా ఉఊ అంటావా అని మగబుద్ధిని మెన్షన్‌ చేస్తూ చంద్రబోస్‌తో పాడించేశారు సుకుమార్.

  • 12 Dec 2021 05:47 PM (IST)

    మొదలైన పుష్ప జాతర…

    తగ్గేదే లే అంటున్న పుష్పరాజ్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు క్యూ కడుతున్న బన్నీ ఫ్యాన్స్..

Published On - Dec 12,2021 5:44 PM