Baby John: సౌత్ ఎమోషన్స్ పట్టవా… సినిమా అంటే డిష్యుం డిష్యుమేనా?
Baby John Trailer Review: సౌత్ లో సూపర్ హిట్ అయిన తెరి సినిమాను హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ ను పూణెలో రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ చూసిన సౌత్ ఆడియన్స్ రీమేక్ వర్షన్ మీద పెదవి విరుస్తున్నారు.
జవాన్ సినిమాతో బాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు అట్లీ.. ఇప్పుడు నిర్మాతగా ఓ హిందీ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సౌత్ లో సూపర్ హిట్ అయిన తెరి సినిమాను హిందీలో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేశారు. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది టీమ్. అయితే ట్రైలర్ చూసిన సౌత్ ఆడియన్స్ రీమేక్ వర్షన్ మీద పెదవి విరుస్తున్నారు.
తెరిలో తండ్రి కూతురు మధ్య బాండింగ్, లవ్ స్టోరీని హైలెట్ చేస్తే హిందీ రీమేక్ లో మాత్రం యాక్షన్ పార్ట్ కే పెద్ద పీట వేశారంటున్నారు ఆడియన్స్. నార్త్ మేకర్స్ ఇలా చేస్తే పర్లేదు. సౌత్‌లో ఆ సినిమాను డైరెక్ట్ చేసిన అట్లీ, నిర్మాతగా ఉండి కూడా సినిమాను ఇలా చేయటం ఏంటన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
గతంలోనూ సౌత్ సినిమాలు నార్త్ లో రీమేక్ చేసిన మేకర్స్ ఆ సినిమాల సోల్ ను మిస్ చేశారన్నది మేజర్ కంప్లయింట్. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీలో భోళా పేరుతో రీమేక్ చేశారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అజయ్ దేవగన్ స్వయంగా నటించి దర్శకత్వవహించిన ఈ మూవీ మీద కూడా అలాంటి కంప్లయింట్సే వినిపించాయి.
ఖైదీ ఒరిజనల్ వర్షన్ లో రెండు, మూడు సాలిడ్ యాక్షన్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా సినిమా అంతా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎమోషనల్ డ్రైవ్ లా సాగుతుంది. కానీ నార్త్ వర్షన్ ను పూర్తిగా మార్చేశారు మేకర్స్. సినిమా అంతా ఓ యాక్షన్ జర్నీలా అనిపిస్తుంది. దీంతో విజువల్స్ పరంగా భోళా గ్రాండ్ గా అనిపించినా… ఖైదీలా మనసును తాకలేదన్న విమర్శలు వినిపించాయి.
బేబీ జాన్ ట్రైలర్..
టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన సౌత్ రీమేక్స్ విషయంలో ఇలాంటి మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. సౌత్ లో సూపర్ హిట్ అయిన వర్షం, క్షణం, తడాకా సినిమాలను హిందీలో రీమేక్ చేసిన టైగర్.. ఆ సినిమాల్లో కథ మొత్తాన్ని పక్కన పెట్టేసి యాక్షన్ సీన్స్ తో నింపేశారు. గ్రాండ్ విజువల్స్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేశారు. మొదట్లో ఈ ఫార్ములా బాగానే వర్కవుట్ అయినా… నెమ్మదిగా ఆడియన్స్ ఇలాంటి సినిమాలను రిజెక్ట్ చేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు బేబీ జాన్ కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.