Sushmita Sen: పాత ప్రియుడి చెంతకు మాజీ ప్రపంచ సుందరి.. 48 ఏళ్ల వయసులో సుష్మిత లవ్ మ్యారేజ్ ?..
మోడల్ నటుడు రోహ్మాన్ షాల్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది సుస్మితా. 2018లో వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. కానీ 2021లో తామిద్దరం విడిపోతున్నామంటూ బ్రేకప్ జరిగిందని తెలిపారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోడీతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుస్మిత.. రోహ్మాన్ మళ్లీ కలిసిపోయారని.. ప్రస్తుతం వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో సుస్మితా సేన్ ఒకరు. 1994లో విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ ప్రియులను తన నటనతో అలరిస్తుంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలిచింది సుస్మితా సేన్. మోడల్ నటుడు రోహ్మాన్ షాల్‌తో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది సుస్మితా. 2018లో వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. కానీ 2021లో తామిద్దరం విడిపోతున్నామంటూ బ్రేకప్ జరిగిందని తెలిపారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ వ్యాపారవేత్త లలిత్ మోడీతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం సుస్మిత.. రోహ్మాన్ మళ్లీ కలిసిపోయారని.. ప్రస్తుతం వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.
అంతేకాకుండా వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే గతంలో తమ మ్యారేజ్ గురించి వచ్చిన రూమర్స్ ను ఇద్దరూ ఖండించారు. ఇటీవల ఫిల్మ్ కాంపానియన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహ్మాన్ తో తన పెళ్లి గురించి ప్రస్తావించింది. వివాహ బంధం, డేటింగ్, స్నేహం, స్వేచ్ఛ గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. సుస్మిత మ్యారేజ్ ప్లాన్స్ గురించి ప్రస్తావించినప్పుడు.. “ఈ దశలోనైనా నేను స్థిరపడాలని ప్రపంచం మొత్తం ఆలోచిస్తుందని నాకు తెలుసు. నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. నేను వివాహ వ్యవస్థను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తాను. కానీ నా జీవితానికి ఇది చాలా ముఖ్యమైనది. నా దర్శకుడు రామ్ మాధ్వానీ, నా నిర్మాత అమితా మాధ్వానీతో తో సహా నాకు తెలిసిన అందమైన జంటలలో ఒకరైన కొంతమంది ఆశీర్వాదం నాకు ఉంది. కానీ స్నేహం, సాంగత్యంలను నేను ఎక్కువగా నమ్ముతాను. అవి ఎప్పుడైనా జరగొచ్చు. కానీ ఆ గౌరవం, దోస్తీ చాలా ముఖ్యం. స్వేచ్ఛ కూడా ముఖ్యమే. అందుకే నేను స్వేచ్ఛను ఇస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
రోహ్మాన్, తాను స్నేహితులుగా ఎంతో సంతోషంగా ఉన్నామని.. తమ ఫ్రెండ్షిప్ లో ఎప్పుడు విఫలం కాలేదని.. ఒకరిపై ఒకరికి చాలా గౌరవం, ప్రేమ ఉందని.. ఒకరి కలలకు మరొకరు ఎప్పుడు తోడుగా ఉన్నామని అన్నారు. సుస్మిత చివరిసారిగా ‘తాలి’లో కనిపించింది. ఇందులో ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
