Esha Deol: 12 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పిన హీరోయిన్.. భర్తతో విడిపోయిన ఈషా డియోల్ ?..

గత కొన్నాళ్లుగా ఈషా డియోల్, ఆమె భర్త భరత్ విడిపోయారని వార్తలు వచ్చాయి. పలు ఈవెంట్స్, కార్యక్రమాల్లో తన భర్త లేకుండానే ఈషా ఒంటరిగా హజరుకావడంతో డివోర్స్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలలో కేవలం ఈషా తాను ఒంటరిగా ఫోటోస్ షేర్ చేస్తుండడంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు వీరి డివోర్స్ నిజమే అని తెలుస్తోంది.

Esha Deol: 12 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పిన హీరోయిన్.. భర్తతో విడిపోయిన ఈషా డియోల్ ?..
Esha Deol
Follow us

|

Updated on: Feb 07, 2024 | 10:33 AM

ప్రముఖ హీరోయిన్ ఈషా డియోల్, ఆమె భర్త భరత్ తక్తానీతో విడిపోయింది. దాదాపు 12 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్దరు ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. చాలాకాలంగా వీరి డివోర్స్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ టైమ్స్ నివేదికల ప్రకారం వీరిద్దరు తమ విడాకుల గురించి అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. “మేము స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా జీవితాలలో మార్పులు.. మా ఇద్దరు పిల్లలను సంరక్షణ.. శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. మా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉండాలని.. మా నిర్ణయాన్ని మీరంతా గౌరవిస్తారని భావిస్తున్నాము” అంటూ ప్రకటించారు. అయితే వీరిద్దరి విడిపోవడానికి కారణమేంటీ అనేది మాత్రం తెలియరాలేదు. దీంతో వీరిద్దరి డివోర్స్ రూమర్లకు చెక్ పడింది.

గత కొన్నాళ్లుగా ఈషా డియోల్, ఆమె భర్త భరత్ విడిపోయారని వార్తలు వచ్చాయి. పలు ఈవెంట్స్, కార్యక్రమాల్లో తన భర్త లేకుండానే ఈషా ఒంటరిగా హజరుకావడంతో డివోర్స్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలలో కేవలం ఈషా తాను ఒంటరిగా ఫోటోస్ షేర్ చేస్తుండడంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు వీరి డివోర్స్ నిజమే అని తెలుస్తోంది. ఇషా, భరత్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2017 కూతురు రాధ, 2019లో పాప మీరయా జన్మించారు.

View this post on Instagram

A post shared by ESHA DEOL (@imeshadeol)

బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర, హేమమాలీన కూతురు ఈషా డియోల్. 21 ఏళ్ల వయసులోనే కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈషా. 2002లో కోయి మేరే దిల్ సే పూచే సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2008 వరకు దాదాపు ఆరేళ్లలో 30కి పైగా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత భరత్ తక్తానీతో పెళ్లి తర్వాత సినిమాకు దూరంగా ఉండిపోయింది.

View this post on Instagram

A post shared by ESHA DEOL (@imeshadeol)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు