Shahid Kapoor: నాని నటన అద్భుతం.. ‘జెర్సీ’ సినిమా చూసి చాలా సార్లు ఏడ్చేశాను… షాహిద్ కపూర్..

నాచురల్ స్టార్ నాని.. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కామెడి టైమింగ్స్‏తోపాటు ఎమోషనల్ సీన్స్‏తో ప్రేక్షకులను

Shahid Kapoor: నాని నటన అద్భుతం.. 'జెర్సీ' సినిమా చూసి చాలా సార్లు ఏడ్చేశాను... షాహిద్ కపూర్..
Nani Shahid Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 24, 2021 | 1:19 PM

నాచురల్ స్టార్ నాని.. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కామెడి టైమింగ్స్‏తోపాటు ఎమోషనల్ సీన్స్‏తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో నాని దిట్ట అనే చెప్పుకోవచ్చు. అందుకే అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు నాచురల్ స్టార్. ముఖ్యంగా జెర్సీ సినిమాలో నాని తన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించాడు. కేవలం తెలుగు ఆడియన్స్ నే కాదు.. తన నటనతో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ను కూడా ఏడిపించేశాడట. ఈ విషయాన్ని స్వయంగా షాహిద్ కపూర్ తెలిపాడు.

తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ సినిమా ప్రస్తుతం హిందీలో రిమేక్ అవుతుంది. ఇందులో నాని పాత్రలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అర్జున్ కపూర్ సినిమాను హిందీ రిమేక్ లో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు షాహిద్ కపూర్. తాజాగా మరోసారి తెలుగు రిమేక్ కు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో షాహిద్ మాట్లాడుతూ.. ఈ మూవీ స్టోరీ.. తన లైఫ్ స్టోరీకి సరిగ్గా సరిపోతుందని.. చాలాకాలంగా కథ గురించి ఆలోచించకుండా సినిమాలు చేశానని.. కెరీర్ ఎక్కడికెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంటూ.. చెప్పుకొచ్చాడు. అసలేమీ చేయాలో తెలియని ఆలోచనలో గడిపేస్తున్న సమయంలో జెర్సీ మూవీ చూశాక.. రిలీఫ్ దొరికిందని తెలిపాడు. రిటైర్ అయ్యాక గుర్తింపు, కీర్తి పొందే వ్యక్తి కథ జెర్సీ మూవీ అని.. ప్రస్తుతం తన లైఫ్ కు ఇది కనెక్ట్ అయ్యిందంటూ వివరించాడు. ఆలస్యంగా సక్సెస్ అందుకోవడం ఎలా ఉంటుందో తనకు తెలుసని.. తను కూడా ఆలస్యంగానే సక్సెస్ అందుకున్న వాడినే అని చెప్పుకోచ్చాడు. ఈ సినిమాలో నాని నటన చూసి నాలుగైదు సార్లు ఏడ్చేశానని ఎమోషనల్ అయ్యాడు షాహిద్. తెలుగు జెర్సీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి.. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. షాహిద్ తండ్రి పంకజ్.. కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ దీపావళికి హిందీ జెర్సీని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

Also Read: Viral Video: ఒకే చొక్కాతో ఏకంగా 264 జూమ్ మీటింగ్స్..ఎవరూ గమనించలేదంటే నమ్మగలరా? ఈ వైరల్ వీడియో చూడండి..

Beauty Tips: కరోనా నుంచి కోలుకున్నాక మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..