Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు.. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి..
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను కలవాలని ఫొటోలు, సెల్ఫీలు దిగాని ఎంతో మంది అభిమానులు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి రహస్యంగా షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్ లోకి ప్రవేశించాడు.

సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి దాడి చేయడం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ భద్రత గురించి అప్రమత్తమవుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు ఇలా సెలబ్రిటీల ఇంట్లోకి చొరబడడం, దాడులకు తెగబడడం పట్ల సినిమా తారలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో షారుఖ్ ఖాన్ మన్నత్‌లోకి కూడా గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా స్నానం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ ఖానే ప్రస్తావించారు. గతంలో కపిల్ శర్మ షోలో పాల్గొన్న బాలీవుడ్ బాద్ షా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఒకసారి తన ఇంట్లో పార్టీ జరుగుతుండగా ఓ అభిమాని మన్నత్‌లోకి ప్రవేశించాడని కింగ్ ఖాన్ చెప్పాడు. ‘ఒకసారి నా ఇంట్లో బర్త్ డే పార్టీ జరిగింది. ఆ సమయంలో పలువురు జర్నలిస్టులు కూడా ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఒక అభిమాని రహస్యంగా నా ఇంట్లోకి ప్రవేశించాడు. సరదాగా మా స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసాడు’
‘ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆ అభిమాని తన సొంత టవల్ తో పాటు స్నానానికి అవసరమైన సరంజామా మొత్తం తీసుకొచ్చుకున్నాడు. స్నానం పూర్తయిన తర్వాత తీరిగ్గా దుస్తులు వేసుకుని పోయేటప్పుడు అతనిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే తాను నన్ను కలవడానికి రాలేదని, ఎలాంటి దొంగ పని చేయడానికి కూడా రాలేదున్నాడు. అతను నేను స్నానం చేసే స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయాలనుకున్నాడట. ఆ పని పూర్తయిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు’
షారుఖ్ ఖాన్‌కి కోట్లాది మంది అభిమానులున్నారు. అతనిని చసేందుకు మన్నత్ వెలుపల అభిమానులు గుమిగూడుతుంటారు. ప్రతి పుట్టినరోజున తన అభిమానులను కూడా కలుస్తుంటాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘పఠాన్’, ‘జవాన్’, ‘డుంకీ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు షారుఖ్. త్వరలోనే ‘కింగ్’ సినిమాతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో షారుఖ్ తో పాటు అతని కూతురు సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కనిపించబోతున్నారు.
గణతంత్ర వేడుకల్లో షారుఖ్ ఖాన్..
This Republic Day, let’s promise ourselves to contribute to an India that we can proudly pass on to the generations to come. Let’s uphold the values of the Constitution and hold our heads high with pride. Happy Republic Day and Jai Hind. pic.twitter.com/2xN3Z24w9N
— Shah Rukh Khan (@iamsrk) January 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.