School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు!
School Holidays: విద్యార్థులకు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు ఆనందంతో మునిగిపోతుంటారు. అయితే ఫిబ్రవరి చివరిలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులులు రానున్నాయి. అయితే ఒక రోజు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ఉంటే మరో రోజు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే సెలవు ఉంటుంది..

విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే ఎగిరి గంతెస్తారు. సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉంటారు. అయితే ఫిబ్రవరి 26, 27తేదీల్లో రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని , ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 26, 27 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల సెలవు ప్రకటించింది.
రెండు రోజుల సెలవులు:
ఫిబ్రవరి 26: మహా శివరాత్రి వేడుక
శివుడికి అంకితం చేయబడిన ప్రధాన హిందూ పండుగ అయిన మహా శివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలు మూసి ఉంటాయి.
ఫిబ్రవరి 27: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్:
తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ MLC స్థానాలకు ఎన్నికలు ఎంపిక చేసిన జిల్లాల్లో జరుగుతాయి. దీంతో ఈ రోజు ఆయా జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది.
తెలంగాణలో ప్రభావిత జిల్లాలు:
- మెదక్
- నిజామాబాద్
- ఆదిలాబాద్
- కరీంనగర్
- వరంగల్
- ఖమ్మం
- నల్గొండ
ఆంధ్రప్రదేశ్: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పాఠశాలలు కూడా ఫిబ్రవరి 27 న మూసి ఉంటాయి.
ఈ సెలవులు ఎందుకు ముఖ్యమైనవి?
మహా శివరాత్రి 2025: ఈ పండుగ ఫిబ్రవరి 26న వస్తుంది. శ్రీశైలం, వేములవాడ వంటి శివాలయాలలో భక్తులు ఉపవాసాలు, రాత్రి జాగరణలు, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దీంతో ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్‌లో 6 ఎమ్మెల్సీ స్థానాలు (తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 3) ఉన్నాయి. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు ఓటు వేయడానికి అర్హులు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో పాఠశాలలు మూసివేయడం తప్పనిసరి.
ఎన్నికల షెడ్యూల్:
- నామినేషన్ తేదీలు: ఫిబ్రవరి 3–10, 2025
- ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 13, 2025
- ఓటింగ్ సమయం: ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
- లెక్కింపు: మార్చి 3, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి