Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Call Merging Scam: కాల్ మెర్జింగ్ స్కామ్ ఏంటి? కొత్త రకం మోసం.. తస్మాత్‌ జాగ్రత్త!

ఈ కొత్త స్కామ్ గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎక్స్ వేదికగా యూజర్లను హెచ్చరించింది. స్కామర్లు యూపీఐ ఓటీపీల కోసం మిమ్మల్ని మోసగించేందుకు కాల్ మెర్జింగ్‌ను ఉపయోగిస్తున్నారు. మీకు తెలియకుండానే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులను కొట్టేస్తున్నారు..

Call Merging Scam: కాల్ మెర్జింగ్ స్కామ్ ఏంటి? కొత్త రకం మోసం.. తస్మాత్‌ జాగ్రత్త!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 19, 2025 | 11:17 AM

యూపీఐ తమ యూజర్లను కొత్త స్కామ్ గురించి అప్రమత్తం చేస్తోంది. స్కామర్లు కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతుండటంతో తన వినియోగదారులకు ముందస్తు అప్రమత్తం చేసింది. మార్కెట్లో కాల్స్ మెర్జ్ కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. కాల్స్‌ మెర్జ్‌ చేయడం ద్వారా మీకు తెలియకుండానే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (OTP) షేర్ చేస్తారు. స్కామర్‌లు అనధికార లావాదేవీలతో మీ అకౌంట్లలో డబ్బును దొంగిలిస్తారు.

ఈ కొత్త స్కామ్ గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎక్స్ వేదికగా యూజర్లను హెచ్చరించింది. స్కామర్లు యూపీఐ ఓటీపీల కోసం మిమ్మల్ని మోసగించేందుకు కాల్ మెర్జింగ్‌ను ఉపయోగిస్తున్నారని, వినియోగదారులు ఇలాంటి మోసాల పాట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండండి. మీ డబ్బును కాపాడుకోండి అంటూ పోస్టులో హెచ్చరించింది.

కాల్ మెర్జింగ్ స్కామ్ ఏంటి?

ఈ స్కామ్ అనేది ఒక గుర్తు తెలియని వ్యక్తి.. మీ ఫోన్ నంబర్‌ను స్నేహితుడి నుంచి తీసుకుని కాల్ చేస్తున్నట్టుగా చెబుతాడు. ఆ తర్వాత స్కామర్ ఆ “స్నేహితుడు” వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని పేర్కొంటూ, కాల్స్ మెర్జ్ చేయమని అడుగుతాడు.

కాల్ మెర్జ్ అయిన తర్వాత యూపీఐ యూజర్లకు తెలియకుండానే వారి బ్యాంక్ లింక్ అయిన అకౌంట్ ఓటీపీ వెరిఫికేషన్ కాల్‌తో కనెక్ట్ అవుతారు. స్కామర్లు అదే సమయంలో మీ ఓటీపీని స్కాన్ చేస్తారు. ఓటీపీ పొందిన వెంటనే మోసగాళ్ళు మీ బ్యాంకు అకౌంట్లలో నుంచి డబ్బులను కాజేస్తారు.

కాల్ మెర్జ్ స్కామ్ నుంచి రక్షించుకోవడం ఎలా?

  • ఈ స్కామ్ బారిన పడకుండా ఉండటానికి యూపీఐ సెక్యూరిటీ టిప్స జారీ చేసింది. అవేంటో చూద్దాం.
  • గుర్తు తెలియని నంబర్లతో కాల్స్ ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు
  • ముఖ్యంగా గుర్తుతెలియని కాల్స్ మెర్జ్ చేయమంటే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.
  • కాలర్ అథెంటికేషన్ ధృవీకరించండి ఎవరైనా మీ బ్యాంక్ నుంచి లేదా తెలిసిన కాంటాక్ట్ నుంచి వచ్చినట్లు చెబితే ముందుగా వారి ఐడెంటిటీని వెరిఫై చేసుకోండి.
  • అనుమానాస్పద ఓటీపీలను రిపోర్టు చేయండి. మీరు చేయని లావాదేవీకి OTP అందితే.. మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయండి.
  • ఎవరైనా ఓటీపీలు, ఇతర వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దు
  • అత్యవసర చర్య తీసుకునేందుకు వెంటనే 1930కు కాల్ చేసి రిపోర్టు చేయండి.
  • గత నెలలో జరిగిన ఒక సర్వేలో భారత్‌లో మూడింట ఒక వంతు మంది రియల్-టైమ్ పేమెంట్లకు సంబంధించిన మోసాలకు గురయ్యారని తేలింది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి