ప్రజల ప్రాణాలు తీస్తున్న ఆన్లైన్ గేమ్స్.. ఒక్కొక్కరిది ఒక్కో కథ.. చివరకు ఆ ఇద్దరు..
ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి.. ఎన్ని సార్లు చెప్పినా.. ఎన్ని ప్రాణాలు పోయినా.. చాలా మంది వినకుండా ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారుతున్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. మొదట..కొన్ని డబ్బులు రావడంతో ఈ ఆటలో మునిగి తేలుతున్నారు. తాజాగా.. ఆన్లైన్ గేమ్‌లో నష్టాలు రావడంతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి.. ఎన్ని సార్లు చెప్పినా.. ఎన్ని ప్రాణాలు పోయినా.. చాలా మంది వినకుండా ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారుతున్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. మొదట..కొన్ని డబ్బులు రావడంతో ఈ ఆటలో మునిగి తేలుతున్నారు. తాజాగా.. ఆన్లైన్ గేమ్‌లో నష్టాలు రావడంతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.. జిల్లాలోని శంకరపట్నం మండలంలో ఇద్దరు వ్యక్తులు ఆన్లైన్ గేమ్‌లో నష్టలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంటర్నేట్ ఏదైనా సైట్ ఓపెన్ చేయగానే అందులో.. ఆన్ లైన్ రమ్మీ, క్యాసినో, రౌలట్ లాంటి గ్యాబ్లింగ్ ఆటలు కనబడుతున్నాయి. వీటికి అట్రాక్ట్ అయి సరదాగా ఆడడం మొదలు పెడితే ప్రారంభంలో డబ్బులు వచ్చేలా చేసి ఆశ పుట్టిస్తారు. ఆ తర్వాత నాలుగైదుసార్లు డబ్బులు పోగొట్టుకుంటే.. ఒకటి, రెండు సార్లు డబ్బులు లాభం వచ్చేలా చేసి మళ్లీ ఆశ కల్పిస్తారు. ఇలా సాఫ్ట్ వేర్ లోనే సెట్ చేసి పెడతారు. ఇందులో లాభాలు రావడం కంటే నష్టపో యినవాళ్లే వేలాదిగా ఉంటారు. చాలామంది యువకులకు ఇదొక వ్యసనంగా మారడంతో రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ కోసం లోన్ యాప్ నుంచి, తెలిసినవారి నుంచి, క్రెడిట్ కార్డుల నుంచి అప్పులు చేయడం.. చివరికి అవి తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడం చాలాచోట్ల జరుగుతోంది. ఆస్తులేవి లేని యువకులు డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
వీడియో చూడండి..
కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన బూస కార్తీక్ (25) కొన్నాళ్లు ఆన్లైన్లో రమ్మీ ఆడాడు. గేమ్ కోసం రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో ఆరు నెలల కింద 20 గుంటల పొలం అమ్మి అప్పు తీర్చేశాడు. తర్వాత మరోసారి రూ. 2.50 లక్షలు అప్పు చేసి రమ్మీ ఆడడంతో ఆ డబ్బులు కూడా పోయాయి. దీంతో మనస్తాపానికి గురైన కార్తీక్ ఇటీవల గ్రామ సమీపంలోని వాగు వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఎడిగ మధు (33) కొన్నినెలలుగా ఆన్లైన్ బెట్టింగ్ పెడుతూ రూ.10 లక్షలకుపైగా పోగొట్టుకున్నాడు. అప్పులు చేసి బెట్టింగ్లో పెట్టడంతో అవి చెల్లించలేక కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని టైంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇలాంటి కేసులు చాలా బయటకు రావడం లేదు. అందుకే ఆన్లైన్ గేమ్‌లు ఆడకూడదని పోలీసులు సూచిస్తున్నారు. అయినప్పటికీ.. చాలా మంది యువకులు ఆ గేమ్ ఆడటంలో మునిగి తేలుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..