AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కొండలు, గుట్టల్లో ఏవో వెతుకుతూ కనిపించారు.. అధికారులు వెళ్లి వారి వద్ద తనిఖీ చేయగా..

అది ఏజెన్సీ ప్రాంతం..! చింతపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధి.. గుట్టుగా కొంతమంది అక్కడ నివాసం పెట్టేశారు.. ఏదో తవ్వకాలు చేస్తున్నారు.. వండి, తిని నివాసానికి వీలుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు కీలక సమాచారం అందింది.. రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీలు చేశారు.. దీంతో అటవీ అధికారులకే షాక్... అక్కడ తవ్వకాల్లో ఏం తీస్తున్నారో తెలుసా..?

Andhra: కొండలు, గుట్టల్లో ఏవో వెతుకుతూ కనిపించారు.. అధికారులు వెళ్లి వారి వద్ద తనిఖీ చేయగా..
Coloured Stones
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Feb 19, 2025 | 12:22 PM

Share

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్ పరిధిలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగిపోతున్నాయి. విలువైన రంగు రాళ్లు కోసం తిష్ట వేసి తవ్వకాలు చేసేస్తున్నారు. ఏకంగా కుటుంబానికి కుటుంబమే వాలిపోయి.. తవ్వేస్తున్నారు. సిగినాపల్లి క్వారీ వద్ద వెతుకులాట చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులకు కీలక సమాచారం అందింది. దీంతో ఆకస్మిక దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పదిమందిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి చెందిన వారుగా గుర్తించారు. 2.2 గ్రాముల విలువైన రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆ రంగు రాళ్లు చూస్తే మిలమిలా మెరిసిపోతున్నాయి. వాటి విలువ లక్షల్లోనే ఉంటుందని అంచనా. వాటితోపాటు తవ్వకాలకు వినియోగించిన పరికరాలు సీజ్ చేశారు. పర్యవేక్షణ లోపం కారణంగా ఇద్దరు కాంట్రాక్టర్ ఉద్యోగుల విధుల నుంచి తొలగించారు అటవీ శాఖ అధికారులు. నిందితులు పదిమందిని అరెస్టు చేశామని అన్నారు అటవీ రేంజ్ అధికారిణి శివరంజని. క్వారీ వద్ద బేస్ క్యాంప్, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పహరా కొనసాగుతుందన్నారు.

అసలు రంగురాళ్లు ఎలా ఏర్పడతాయి….

రంగురాళ్లు ఏర్పడటం అనేది వందల ఏళ్ల కొలది జరిగే ప్రక్రియ. భౌగోళిక పరిస్థితుల కారణంగా.. ఆయా ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతల ఫలితంగా అక్కడి రాళ్లు సంగ్రహించే కాంతిని బట్టి వాటికి ప్రత్యేక లక్షణాలు వస్తాయి. అవి అలా రూపాంతరం చెందుతాయి. దాంతో ఆ రాళ్ల అంతర్గత లక్షణాలు, ఉపరితల రంగు విషయంలో మార్పులు సంభవిస్తాయి. దీంతో అవి ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంటాయి. వాటినే రంగురాళ్లు అంటారు. తూర్పు కనుమల్లో ఈ రంగురాళ్ల లభ్యత ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!