అనుపమ జర్నీ స్లో అయ్యిందా..? తెలుగులో సినిమాలు తగ్గించిందిగా ..

Rajeev 

18 February 2025

Credit: Instagram

తెలుగులో జోరు తగ్గించింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు తమిళ్ లో సినిమాలు చేస్తుంది. 

ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు ఎప్పుడో ఒక సినిమా చేస్తుంది.

చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ సినిమాలో కనిపించింది. ఈ చిత్రంలో గ్లామర్ బ్యూటీగా కనిపించి ఒక్కసారిగా కుర్రాళ్లకు షాకిచ్చింది. 

ఈ సినిమా తర్వాత మాత్రం అమ్మడు ఫిల్మ్ జర్నీ స్లో అయ్యింది. ప్రస్తుతం పరదా సినిమాలో నటిస్తుంది. 

అలాగే డ్రాగన్ అనే సినిమాలోనూ నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

తెలుగులో ఈ అమ్మడు ఇంతవరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. దాంతో ఆమె ఫాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.