లైఫ్ లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా చూడని డైరెక్టర్స్ 

Phani CH

18 February 2025

Credit: Instagram

డైరెక్టర్లు వరుసగా విజయాలు సాధించాలి అంటే ఎంతో కృషి పట్టుదల ఉంటే కానీ విజయాలు సాధించడం సాధ్యం కాదు. మన ఇండియన్  లో అలాంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు.

ఎస్ ఎస్ రాజమౌళి: ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు రాజమౌళి మొత్తం పన్నెండు సినిమాలు డైరెక్షన్ చేయగా  వీటిలో అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.

అట్లీ: ఇతను తక్కువ సినిమాలు చేసిన పాపులారిటీ ఎక్కువ సంపాదించుకున్నాడు అట్లీ. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది.

 లోకేష్ కనకరాజు: నగరం, ఖైదీ, మాస్టర్ ఇలా వరుస సినిమాలతో హిట్ అందుకున్నారు కనకరాజు. ఈయన తీసిన సినిమాల్లో ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ లేదు.

 ప్రశాంత్ నీల్: కే జి ఎఫ్ సినిమా తో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఉగ్రం మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన కెరీర్లో ఒక ఫ్లాప్ లేదు.

 వెట్రిమారన్: ఆయన ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీశారు. అన్ని సూపర్ హిట్ సినిమాలే. ఇందులో నాలుగు సినిమాలు ధనుష్ తోనే తీశారు.

 రాజకుమార్ హిరని: సినిమా లో మెసేజ్ అండ్ ఎమోషన్స్ ని ఎక్కువగా చూపించడంలో దిట్ట. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశారు. అన్ని బ్లాక్ బస్టర్ హిట్.