మన దేశంలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలు తీర్చే సహజ ఔషధాలుగా పనిచేస్తాయి.
అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి సహాయ పడేవాటిలో తిప్పతీగ ఒకటి.. ఒక్క తిప్పతీగ.. ఒంట్లో ఉన్న తిప్పలన్నీ దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.
తిప్ప తీగలో కనిపించే అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తరచుగా దగ్గు, జలుబు, టాన్సిలిటిస్, ఉబ్బసం ,ఛాతీ బిగుతుగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, గురక వంటి లక్షణాలను తిప్పతీగ తగ్గిస్తుంది.
తిప్పతీగ రసం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. మధుమేహం, చర్మవ్యాధులు, కొన్ని కీళ్ల వ్యాధులు, నులిపురుగులు, జ్వరం, దగ్గు మొదలైన వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
తిప్పతీగ వేర్లు, త్రిఫల చూర్ణం కలిపి కషాయాలను తయారు చేసి, తేనెతో కలిపి, క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.
10-20 మిల్లీలీటర్ల తిప్పతీగ రసాన్ని రోజుకు 3 సార్లు తాగితే చర్మవ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు దీనిని తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి..
తిప్పతీగ జ్యూస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. తిప్పతీగ శరీరంలో రోగ నిరోధకశక్తిని మెరుగుపర్చి అనేక వ్యాధులను నియంత్రిస్తుంది.