మరోసారి ప్రేమించాలి అంటే భయమేస్తుంది.. చివరికి వరకు నాకు తోడుంటావా ?

Phani CH

17 February 2025

Credit: Instagram

హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.

టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడి అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

ఫిబ్రవరి 16న సమంత తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆమె క్యాప్షన్‌గా సెలెనా గోమెజ్ ఇటీవల విడుదల చేసిన Scared of Loving You పాట నుండి లిరిక్స్ తీసుకుని పెట్టింది

దీని అర్థం ఏమనగా.. నువ్వు నా పక్కనే ఉంటావా..? ఎల్లప్పుడూ నా చెయ్యి పట్టుకొనే ఉంటావా..? ఇంతలా ఎమోషన్ క్యాప్షన్ షేర్ చేయగ అభిమానులు సమంత ప్రేమలో ఎంతగా బాధపడింది విషయం తెలుస్తోంది అని అంటున్నారు.

ఇటీవల సమంత.. డైరెక్టర్ రాజ్ నిధిమోరు తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన క్యాప్షన్ చర్చనీయాంశంగా మారింది.  

సమంత గతంలో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటించారు. అయితే, ఆమె మయోసిటిస్ అనారోగ్య సమస్య కారణంగా కెరీర్‌కు స్వల్ప విరామం తీసుకున్నారు.

అయితే ఈ ముద్దుగుమ్మ తెల్లని డ్రెస్ ధరించి అందంగా కనిపిస్తూ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.