సినిమాలు వద్దు.. డాక్టర్ వృత్తి ముద్దు అంటున్న స్టార్ హీరోయిన్

Phani CH

17 February 2025

Credit: Instagram

సౌత్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుని.. లేడీ పవర్ స్టార్ గా సౌత్ లో పేరు తెచ్చుకుంది

అయితే ఈ ముద్దుగుమ్మ ఇక పై సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్ గా కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నది అనే వార్త చెక్కర్లు కొడుతోంది.

ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో మంచి కథ, తన క్యారెక్టరైజేషన్ ను చూసుకుంటూ వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతోంది.

ఈమధ్య రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక తాజాగా సాయి పల్లవి నటించిన తండేల్ బాక్సఅఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ ను దాటింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా సాయిపల్లవికి పెళ్లి కుదిరిందని.. అబ్బాయి కూడా ఓ డాక్టర్ అని ఇక సినిమాలు కూడ వదిలేస్తుందని న్యూస్ వైరల్ అయ్యింది.

వాటిలో నిజం లేదని సాయిపల్లవి క్లారిటీ ఇచ్చింది. తాను అస్సలు పెళ్ళి చేసుకుంటానో లేదో కూడా తెలియదంటూ బాంబ్ పేల్చింది.

ప్రస్తుతం మరొక వార్త హైలెట్ అవుతుంది.. సాయి పల్లవి జార్జియాలో MBBS చదివిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ముద్దుగుమ్మ సినిమాలు వదిలి తన డాక్టర్ వృత్తికి న్యాయం చేయాలని అనుకుంటుందట.

దీని కోసం  కోయంబత్తూర్‌లో సొంతంగా ఒక హాస్పిటల్‌ను కట్టి డాక్టర్ గా సెటిల్ అవ్వబోతుందట. దీన్ని బట్టి  ఏదో ఒకట టైమ్ లో రిటైర్మెంట్ తీసుకుని.. డాక్టర్ అవతారం త్తాలనేది సాయి పల్లవి నిర్ణయంగా తెలుస్తోంది