ఛావా సినిమాకు రష్మికా తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Phani CH

18 February 2025

Credit: Instagram

రష్మికా మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..  వరుస హిట్స్ తో ఈ ముద్దుగుమ్మ కెరీర్ లో దూసుకుపోతుంది.

2014లో రష్మికా మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి  క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది, క్లీన్ & క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. 

ఆ తరువాత ఆమె కిరిక్ పార్టి అనే కన్నడ మూవీ తో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.. మొదటి సినిమాతోనే తన నటనతో అందరి మనసులు దోచుకుంది.

ఆ తరువాత 2018 లో నాగ శౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగమ్మ.

ఇది ఇలా ఉంటే తెలుగు లో మాత్రం వరస విజయాలతో ముందుకు దూసుకుపోతుంది ఈ చిన్నది. తాజాగా పుష్ప2 సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది.

ఇది ఇలా ఉంటే విక్కీ కౌశల్ హీరోగా నటించన ఛావా సినిమాలో ఆయన శంభాజీ మహారాజ్ భార్య యేసు భాయ్ పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. 

అయితే ఈ సినిమా రష్మికాకు నిర్మాతలు ఏకంగా రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం. విక్కీ కౌశల్ కి కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చారట.