Ranveer Singh: రణ్‌వీర్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు.. న్యూడ్ ఫొటోలతో మహిళల సెంటిమెంట్లను గాయపరిచారంటూ..
Ranveer Singh: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఓ మ్యాగజైన్‌కు ఒంటి పై నూలు పోగు లేకుండా చేసిన ఫొటో షూట్ సంచలనం సృష్టించింది. ఈ టాపిక్ ఒక్క బాలీవుడ్‌నే...
Ranveer Singh: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఓ మ్యాగజైన్‌కు ఒంటి పై నూలు పోగు లేకుండా చేసిన ఫొటో షూట్ సంచలనం సృష్టించింది. ఈ టాపిక్ ఒక్క బాలీవుడ్‌నే కాకుండా యావత్ ఇండియా వ్యాప్తంగా సంచలనంగా మారింది. టాప్ హీరో ఇలా ఫొటో షూట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొందరు రణ్‌వీర్‌కు మద్ధతు నిలిస్తే, మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేశారు.
‘నేను శారీరకంగా నగ్నంగా ఉండడం చాలా సులభం.. కానీ కొన్ని ప్రదర్శనలో నేను ఇలా కనిపిస్తాను అని తెలియజేశారు.. నేను ఎంతమంది ఉన్నా సరే ఇలా నగ్నంగా ఉండగలను ఈ విషయంలో నాకు ఎలాంటి సిగ్గు , బిడియం లేదని’ చెబుతూ రణ్‌వీర్ పోస్ట్ చేసిన పోస్ట్ తీవ్ర చర్చకు దారి తీసింది. రణ్‌వీర్ సింగ్ ఫొటో షూట్‌పై నిరసనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురు రోడ్లపైకి వచ్చి రణ్‌వీర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
View this post on Instagram
ఈ నేపథ్యంలో తాజాగా ముంబయిలో రణ్‌వీర్‌పై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు మరో మహిళా న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణ్‌వీర్ న్యూడ్ ఫొటోలను పోస్ట్ చేయడం ద్వారా మహిళల సెంటిమెంట్లను గాయపరిచారంటూ ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్ 67ఏతో పాటు 292, 293, 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..