AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడి సవతి తండ్రిని హత్య చేసిన గర్ల్ ఫ్రెండ్.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. 9 కోట్లతో తీస్తే 33 కోట్లు రాబట్టిన సినిమా..

కేవలం రూ.9 కోట్లతో రూపొందించిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.33 కోట్లు రాబట్టింది. అప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న అందాల తార ఒక్కసారిగా విలన్ పాత్రలో అదరగొట్టేసింది. ఆ సినిమాలో విలన్ పాత్రకుగానూ ఫిల్మ్ పేర్ అవార్డ్ అందుకుంది. ఇంతకీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఆ సినిమా ఏంటీ అనుకుంటున్నారా.. ?

ప్రియుడి సవతి తండ్రిని హత్య చేసిన గర్ల్ ఫ్రెండ్.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. 9 కోట్లతో తీస్తే 33 కోట్లు రాబట్టిన సినిమా..
Gupt Movie
Rajitha Chanti
|

Updated on: Jul 11, 2024 | 1:04 PM

Share

ప్రస్తుతం హారర్ కామెడీ.. సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ చిత్రాలు చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో ఇలాంటి తరహా కంటెంట్ తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో యాక్షన్, సస్పెన్స్, మర్డరీ మిస్టరీ చిత్రాలు విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ గతంలో ఓ మర్డర్ మిస్టరీ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిందని మీకు తెలుసా..? అనుక్షణం ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఇక ఆ మూవీ క్లైమాక్స్ చూసి అందరూ షాకయ్యారు. అడియన్స్ కనువిని ఎరుగని క్లైమాక్స్‏తో ఆ సినిమా ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కేవలం రూ.9 కోట్లతో రూపొందించిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.33 కోట్లు రాబట్టింది. అప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న అందాల తార ఒక్కసారిగా విలన్ పాత్రలో అదరగొట్టేసింది. ఆ సినిమాలో విలన్ పాత్రకుగానూ ఫిల్మ్ పేర్ అవార్డ్ అందుకుంది. ఇంతకీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఆ సినిమా ఏంటీ అనుకుంటున్నారా.. ? అదే గుప్త్: ది హిడెన్ ట్రూత్ (Gupt: The Hidden Truth).

గుప్త్: ది హిడెన్ ట్రూత్.. 1997 జూలై 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ రాజీవ్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ హీరోగా నటించగా.. కాజోల్, మనీషా కొయిరాలా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చివర్లో అసలు హంతకుడు ఎవరన్నది తేలియడంతో అందరూ షాకవుతారు. ఈ సినిమాలో బాబీ డియోల్ తన సవతి తండ్రిని హత్య చేసిన ఆరోపణలతో జైలుకు వెళతాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ కాజోల్, బెస్ట్ ఫ్రెండ్ మనీషా కొయిరాలా ఇద్దరూ అతడిని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఇందుకు ఈ ముగ్గురు కలిసి ఓ మిషన్ ప్లాన్ చేస్తారు.

అయితే చివరగా క్లైమాక్స్‏లో బాబీ డియోల్ గర్ల్ ఫ్రెండ్ కాజోల్ అతడి సవతి తండ్రిని హత్య చేసినట్లు తెలుస్తోంది. అద్భుతమైన క్లైమాక్స్‌తో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కేవలం రూ.9 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేసినందుకు కాజోల్ కి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్. ఇందులో జీవ్ ఓం పురి, కులభూషణ్ ఖర్బండా, పరేష్ రావల్, దలీప్ తాహిల్, ప్రేమ్ చోప్రా, సదాశివ్ అమ్రాపుర్కర్, శరత్ సక్సేనా, ముఖేష్ రిషి కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.