Kiara Advani: ఆ హీరోయిన్ చేసిన పాటను నేనేప్పటికీ చేయను.. చేయాల్సి వస్తే సినిమానే వదిలేస్తా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా భూల్ భూలయ్యా 2 ప్రమోషన్లలో భాగంగా

Kiara Advani: ఆ హీరోయిన్ చేసిన పాటను నేనేప్పటికీ చేయను.. చేయాల్సి వస్తే సినిమానే వదిలేస్తా..  హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Kiara
Follow us

|

Updated on: Jun 07, 2022 | 11:26 AM

ఇటీవల విడుదలైన భూల్ భూలయ్యా 2 సినిమా సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. ఆనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కియారా అద్వానీ (Kiara Advani), కార్తీక్ ఆర్యన్, టబు, రాజ్ పాల్ యాదవ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా భూల్ భూలయ్యా 2 ప్రమోషన్లలో భాగంగా చిత్రయూనిట్ ఇటీవల ప్రముఖ ఫేమస్ షో కపిల్ శర్మ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొన్న కియారా.. తనకున్న ఫోబియా గురించి బయటపెట్టింది. ఇందులో కపిల్ శర్మ తనకున్న భయాల గురించి ఆమెను అడిగ్గా.. తనకు బర్డ్ ఫోబియా ఉందనే విషయాన్ని చెప్పుకొచ్చింది కియారా.

కియారా మాట్లాడుతూ.. “నాకు బర్డ్ ఫోబియా ఉంది.. అంటే నాకు పెద్ద పక్షులను చూస్తే భయం వేస్తుంది. అది ఎందుకు అలా జరుగుతుందో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద పక్షులను చూసినప్పుడు భయపడతాను. వాటిని చూడగానే ఏడుస్తాను. సోనమ్ కపూర్ చేసిన మసకాలి పాటను నేను ఎప్పటికీ చేయలేను.. ఒకవేళ సినిమాలో అలాంటి పాటలు చేయాల్సి వస్తే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కియారాకు బర్డ్ ఫోబియా ఉందనే విషయం తమకు తెలియదని.. లేదంటే ఈ విషయం గురించి ఆలోచించేవాళ్లమంటూ నవ్వులు పూయించారు డైరెక్టర్ అనీస్ బజ్మీ.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కియారా.. మెగపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. అలాగే వరుణ్ ధావన్, అనిల్ కపూర్, నీతూ కపూర్, మనీష్ పాల్ ప్రధానపాత్రలలో నటించిన జగ్ జగ్ జీయో సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని జూన్ 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!