AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood: బాలీవుడ్‌లో మళ్ళీ కరోనా పంజా.. 50మందికి సెలబ్రెటీలకు పాజిటివ్.. కరణ్ బర్త్ డే వేడుకలే కారణం అంటూ టాక్

Bollywood: మే 25న ముంబైలోని యష్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో జరిగిన కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీలోనే కరోనా స్ప్రెడ్ అయిందనే టాక్ వినిపిస్తుంది. అయితే, ఈ పుకార్లు అవాస్తవమని ఒక నివేదిక వెల్లడించింది.

Bollywood: బాలీవుడ్‌లో మళ్ళీ కరోనా పంజా.. 50మందికి సెలబ్రెటీలకు పాజిటివ్.. కరణ్ బర్త్ డే వేడుకలే కారణం అంటూ టాక్
Karan Johars Birthday Party
Surya Kala
|

Updated on: Jun 06, 2022 | 12:33 PM

Share

Bollywood: రెండేళ్ల క్రితం తన పుట్టినిల్లు చైనా నుంచి ప్రపంచంలో అడుగు పెట్టిన కరోనా మహమ్మారి రకరకాల రూపాలను సంతరించుకుంటుంది. థర్డ్ వేవ్ అనంతరం మన దేశంలో తగ్గిన కరోనా తాజాగా మళ్లీ తన ప్రతాపం చూపుతోంది. గత కొన్ని రోజులుగా పంజా విసురుతోంది. ఇప్పటి వరకూ ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా ఈ మహమ్మారి తీరని దెబ్బ కొట్టింది. ఇప్పుడు మళ్లీ ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నట్టు మెల్లమెల్లగా జూలు విదుల్చుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ కరోనా బాధితులుగా మారుతున్నారు.

ఇప్పటికే భారత సినీ పరిశ్రమలో అనేక మంది కరోనా బారిన పడ్డారు. ఎందరో ప్రముఖులను ఈ కరోనా బలి తీసుకుంది.  తాజాగా బాలీవుడ్ లో మరోసారి కరోనా కలకలం మొదలైంది. ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌, కత్రినా కైఫ్‌, కార్తీక్‌ ఆర్యన్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, షారుఖ్ ఖాన్.. మరి కొంతమంది స్టార్లు తమకి కరోనా వచ్చిందని ప్రకటించారు. ఇంకొందరు సెలబ్రిటీలు కరోనా వచ్చినా బయటకి చెప్పకుండా సైలెంట్ గా ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో పలు షూటింగ్స్, ఈవెంట్స్ కూడా ఇప్పటికే ఆగిపోయినట్టు తెలుస్తోంది. చాలా మంది బాలీవుడ్ తారలు కరోనా బారిన పడి హోమ్ క్వారెంటైన్‌లో ఉంటున్నారు.

అయితే ఇదంతా కరణ్ జోహార్ పార్టీ వల్లే వచ్చిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మే 25న ముంబైలోని యష్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో జరిగిన కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు బాలీవుడ్‌ సెలబ్రిటీలు అంతా పాల్గొన్నారు. ఈ పార్టీలోనే కరోనా స్ప్రెడ్ అయిందనే టాక్ వినిపిస్తుంది. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో దాదాపు 50 మందికి పైగానే కరోనా సోకి ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ పుకార్లు అవాస్తవమని ఒక నివేదిక వెల్లడించింది. అయితే కరణ్ ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ షూటింగ్ లో ఉన్నాడు. కరోనా నిబంధనల ప్రకారం.. షూటింగ్ లో పాల్గొన్నాడని ముందు కోవిడ్ -19 పరీక్షలు చేయించుకుంటున్నాడు. సెలబ్రిటీ చాట్ షో సెట్‌లో తప్పని సరిగా కోవిడ్-19 నిబంధనలను అతిథులు కూడా అనుసరిస్తున్నారని షో చిత్ర యూనిట్ వెల్లడించింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!