Kamaal R Khan: బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కేఆర్కే అరెస్ట్.. అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు.. ఎందుకంటే..
ఇవాళ బోరివలి కోర్టులో కేఆర్కే ను ప్రవేశపెట్టనున్నారు. కేఆర్కే బీటౌన్ సెలబ్రెటీల గురించి వివాస్పద వ్యాఖ్యలతో.. ట్వీట్స్ చేస్తూ వెలుగులోకి వచ్చాడు.

బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ను (Kamaal R Khan) ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో చేసిన ఓ ట్వీట్ తో ఆయనపై కేసు నమోదైంది. దీంతో మంగళవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో మలాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020లో కేఆర్కే ఇర్ఫాన్, రిషి కపూర్ ల గురించి పలు ట్వీట్స్ చేశాడు. దీంతో యువసేన సభ్యుడు రాహుల్ కనల్ కమల్ ఆర్ ఖాన్ పై మలాడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇవాళ బోరివలి కోర్టులో కేఆర్కే ను ప్రవేశపెట్టనున్నారు. కేఆర్కే బీటౌన్ సెలబ్రెటీల గురించి వివాస్పద వ్యాఖ్యలతో.. ట్వీట్స్ చేస్తూ వెలుగులోకి వచ్చాడు.
గతంలో పలు చిత్రాల్లో నటించిన కేఆర్కే.. ఆ తర్వాత బిగ్ బాస్ హిందీ సీజన్ 3లో పాల్గొన్నారు. కానీ ఇండస్ట్రీలో తనకంటూ ఏలాంటి గుర్తింపు రాలేదు. తనను తాను సినీ క్రిటిక్ గా చెప్పుకునే కేఆర్కే.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, అమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి టాప్ హీరోలందరి మీద విమర్శలు చేసి నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడు సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. అసహ్యకరమైన పదజాలం ఉపయోగిస్తాడని.. సమాజంలో ఇలాంటి ప్రవర్తన సరైనది కాదని.. అందుకే కేఆర్కే పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు రాహుల్ కనల్.








