Meghana Raj: రేపు ఏం జరుగుతుందో తెలీదు.. అందుకే రెండో పెళ్లి.. నా మనసుకు ఏదనిపిస్తే ఆదే..

Meghana Raj: రేపు ఏం జరుగుతుందో తెలీదు.. అందుకే రెండో పెళ్లి.. నా మనసుకు ఏదనిపిస్తే ఆదే..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2022 | 8:19 PM

కన్నడ స్టార్‌ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణంతో మానసికంగా కుంగిపోయారు ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌ . ఓ సినిమా షూటింగ్‌లో మొదటిసారి కలుకున్న వీరిద్దరు ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు.


కన్నడ స్టార్‌ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణంతో మానసికంగా కుంగిపోయారు ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌ . ఓ సినిమా షూటింగ్‌లో మొదటిసారి కలుకున్న వీరిద్దరు ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. పెద్దల ఆశీర్వాదంతో 2018 మే 2న పెళ్లిపీటలెక్కారు. వీరి ప్రేమబంధానికి ప్రతీకగా ఓ పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే మేఘనా గర్భం దాల్చిన కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్‌ 7న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో భర్త జ్ఞాపకాల్లోనే బతుకుతూ కొన్ని రోజులు ఇంటికే పరిమితమయ్యారు మేఘన. అయితే అదే ఏడాది రాయన్‌రాజ్‌ సర్జా పుట్టడంతో తన భర్త ప్రతిరూపమైన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే మేఘన రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వదంతులపై స్పందించిన మేఘన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.‘కొందరు తనను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారని, మరికొందరేమో తన కుమారుడిని బాగా చూసుకుంటూ అతడితోనే ఉండమని సలహాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఎవరి మాట వినాలో తనకు అర్థం కావడం లేదన్నారు. తన భర్త చిరంజీవి ఎప్పుడూ తనతో ’ మన గురించి ఈ ప్రపంచం ఏమనుకుంటుందనేది ఎప్పుడూ పట్టించుకోకు.. నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేయమని’ చెప్పేవారని తెలిపారు. అయితే మళ్లీ పెళ్లి గురించి తనని తానెప్పుడూ ప్రశ్నించుకోలేదని, రేపు ఏం జరుగుతుంది అనే ఆలోచించన తనకు రాలేదని చెప్పుకొచ్చారు మేఘన. కాగా అల్లరి నరేష్‌ హీరోగా నటించిన బెండు అప్పారావ్‌ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆతర్వాత కన్నడ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చున్న మేఘన… వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక సినిమాలు తగ్గించారు. కాగా ఆమె త్వరలో బుద్ధివంత 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Shocking Video: మూడుసార్లు కాటేసినా.., తగ్గలే అంటూ పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి..

Groom Cake Viral: వీడేం పెళ్ళికొడుకు.. వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా..!

Published on: Aug 30, 2022 08:17 AM