Actor: స్టార్ హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం కదా! లేడీ గెటప్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?

ఈ ఫొటోలో కనిపిస్తున్న అందాల తారను గుర్తు పట్టారా? ఇందులో ఉన్నది ఏ స్టార్ హీరోయినో అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ లేడీ గెటప్ లో ఉన్నది ఒక ట్యాలెంటెడ్ హీరో. అతను సినిమా సినిమాకు వెరైటీ క్యారెక్టర్లను ఎంచుకుంటున్నాడు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటూ మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. ఇటీవల ఈ యంగ్ హీరో నటించిన సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తోంది

Actor: స్టార్ హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందం కదా! లేడీ గెటప్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
Bollywood Actor
Follow us

|

Updated on: Aug 29, 2024 | 12:55 PM

ఈ ఫొటోలో కనిపిస్తున్న అందాల తారను గుర్తు పట్టారా? ఇందులో ఉన్నది ఏ స్టార్ హీరోయినో అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ లేడీ గెటప్ లో ఉన్నది ఒక ట్యాలెంటెడ్ హీరో. అతను సినిమా సినిమాకు వెరైటీ క్యారెక్టర్లను ఎంచుకుంటున్నాడు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటూ మినిమం గ్యారెంటీ హీరోగా మారిపోయాడు. ఇటీవల ఈ యంగ్ హీరో నటించిన సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. ఈ మూవీ ధాటికి ప్రభాస్ కల్కి, షారుఖ్ ఖాన్ జవాన్, కేజీఎఫ్ 2 లాంటి రికార్డులు కూడా గాలిలో కలిసిపోయాయి. బాలీవుడ్ లో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న ఆ హీరో మరెవరో కాదు.. స్త్రీ2 సినిమా హీరో రాజ్ కుమార్ రావ్. ఈ లేడీ గెటప్ కూడా ఇందులోదే. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో ఈ లేడీ గెటప్ కు సంబంధించిన సీన్లను ఎడిటింగ్ లో తొలగించారట. అయితే అభిమానుల కోసం తన లేడీ గెటప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాజ్ కుమార్ రావ్. ‘స్ట్రీ 2లో నాకు చాలా ఇష్టమైన ఫన్నీ సన్నివేశాలు ఉన్నాయి. అందులో ఈ సీన్ కూడా ఒకటి. అయితే ఫైనల్‌ కట్‌లో ఈ సీన్‌ని సినిమా నుంచి తప్పించారు. మీరు ఈ సన్నివేశాన్ని సినిమాలో చూడాలనుకుంటున్నారా? మీరంతా చెప్పండి’ అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తూ దర్శకుడు అమర్ కౌశిక్‌ను కూడా రాజ్‌కుమార్ ట్యాగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రాజ్ కుమార్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు ఈ ఫొటోపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. స్త్రీ 2’లో రాజ్‌కుమార్ సరసన హీరోయిన్ గా నటించిన శ్రద్ధా కపూర్ అయితే.. ‘అవును, మేము ఈ సీన్ ను సినిమాలో చూడాలనుకుంటున్నాం’ అని కోరింది. ఇక విక్కీ కౌశల్ దయచేసి ఈ సీన్ ను సినిమాలో యాడ్ చేయండి’ అని రిక్వెస్ట్ చేశాడు. మరో నటుడు విజయ్ వర్మ, ‘హహ, ఇది చూడటానికి నేను డబ్బులు కూడా చెల్లిస్తాను’ అని క్రేజీ కామెంట్ చేశాడు. ఇక సాధారణ ప్రేక్షకులు కూడా కనీసం ఓటీటీలో సినిమాను విడుదల చేసే సమయంలోనైనా ఈ సన్నివేశాలను యాడ్ చేయాలని కోరుతున్నారు.

కనీసం ఓటీటీలో నైనా ఈ సీన్స్ యాడ్ చేయండి ప్లీజ్ అంటోన్న ఫ్యాన్స్..

ఇక స్త్రీ2 కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇప్పటికే రూ. 500 కోట్లు దాటేసింది. త్వరలోనే మరిన్ని రికార్డులు కొల్లగొట్టేందుక సిద్ధమవుతోంది. ఇందులో శ్రద్ధా కపూర్, శ్రద్ధా కపూర్, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ మరియు పంకజ్ త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

కృష్ణాష్టమి వేడుకల్లో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.