AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: షారుఖ్‌తో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ స్టార్ హీరో పేరే వినిపిస్తోంది

బలమైన సినిమా నేపథ్యమున్న కుటుంబం.. అయినా ఈ నటుడికి అవకాశాలు అంత ఈజీగా రాలేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ తో ఆడియెన్స్ ను మెప్పించాడు. తన అభినయ ప్రతిభతో ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు.

Tollywood: షారుఖ్‌తో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ స్టార్ హీరో పేరే వినిపిస్తోంది
Shah Rukh Khan
Basha Shek
| Edited By: |

Updated on: Mar 01, 2025 | 8:30 PM

Share

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో ఉన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టరా? ఈ పిల్లాడు ఇప్పుడు స్టార్ హీరో. ఓ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు. కానీ సక్సెస్ మాత్రం అంత త్వరగా దక్కలేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించాడు. ఆపై సోలో హీరోగానూ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. తన నటనా ప్రతిభతో ప్రతిష్ఠాత్మక జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా అందుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రశంసలతో పాటు పురస్కారాలు కూడా అందుకున్నాడు. అయితే మొన్నటి వరకు ఈ హీరో కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ పడలేదు. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. ప్రస్తుతం ఈ నటుడి పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ హీరో నటించిన ఒక సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రూ. 500 కోట్లకు చేరువైంది. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. పై ఫొటోలో షారుఖ్ తో ఉన్నది మరెవరో కాదు ఛావా హీరో విక్కీ కౌశల్.

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఓ సినిమా షూటింగుకు తండ్రి, యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ తో కలిసి వెళ్లాడు విక్కీ కౌశల్. అక్కడే కింగ్ ఖాన్ తో కలిసి ఫొటోలు దిగాడు. ఛావా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో విక్కీకి సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా అదే.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ లో బయోపిక్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు విక్కీ కౌశల్. గతంలో యురి సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అతను సర్దార్ ఉద్దమ్, సామ్ బహదూర్ వంటి రియల్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలోనూ అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఇప్పటికే రూ. 500 కోట్లకు చేరువైన ఈ మూవీ మార్చి 7న తెలుగు వెర్షన్ లోనూ విడుదల కానుంది.

మార్చి 7 న ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.