Tollywood: ఈ చిన్నోడు పాన్ ఇండియా సూపర్ స్టార్.. రూ.2900 కోట్లకు అధిపతి.. ఎవరో గుర్తుపట్టగలరా ?.
ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇప్పుడు ఓ పాన్ ఇండియా సూపర్ స్టార్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా. అందులో ఉన్న ఆ చిన్నోడు స్టార్ హీరో. భారీ ఫాలోయింగ్ ఉన్న నటుడు. నిజానికి అతడు బాలీవుడ్ హీరో. కానీ తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు అతడు రూ.2900 కోట్ల సంపాదనకు అధిపతి. ఎవరో గుర్తుపట్టారా ?..

సోషల్ మీడియాలో చాలా రోజులుగా సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. సౌత్ టూ నార్త్ స్టార్ హీరోహీరోయిన్స్ బాల్యం నాటి జ్ఞాపకాలు నెట్టింట హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ చిన్ననాటి ఫోటోస్ తెగ చక్కర్లు కొట్టాయి. తాజాగా ఇప్పుడు ఓ పాన్ ఇండియా సూపర్ స్టార్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా. అందులో ఉన్న ఆ చిన్నోడు స్టార్ హీరో. భారీ ఫాలోయింగ్ ఉన్న నటుడు. నిజానికి అతడు బాలీవుడ్ హీరో. కానీ తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు అతడు రూ.2900 కోట్ల సంపాదనకు అధిపతి. ఎవరో గుర్తుపట్టారా ?.. అతడే స్టార్ హీరో సల్మాన్ ఖాన్.
భాయిజాన్, సల్లూభాయ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. బాలీవుడ్ కింగ్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ క్రానిక్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్నారు. సల్మాన్ నికర విలువ రూ.2,900 కోట్లు. సల్మాన్ ఖాన్ 1988లో ‘బివి హో తో ఇసి’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. కానీ 1989లో రిలీజైన మైనే ప్యార్ కియా సినిమాలోనే తొలిసారి హీరోగా నటించాడు. ఆ తర్వాత ఏక్ లడ్కా ఏక్ లడ్కీ, చంద్ర ముఖి, కుచ్ కుచ్ హోతా హై, దబాంగ్, ఏక్ థా టైగర్, హమ్ దిల్ దే చుకే సనమ్, తేరే నామ్, టైగర్ జిందా హై, బజరంగీ బైజాన్, సుల్తాన్, కిక్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వంటి ఎన్నో హిట్‌లు అందుకున్నాడు.
View this post on Instagram
ప్రముఖ రచయిత సలీం ఖాన్, సుశీలా చరక్‌ల పెద్ద కుమారుడు సల్మాన్ ఖాన్. నటులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ ఇద్దరూ సల్మాన సోదరులు. హిందీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన సల్మాన్ అటు వ్యాపారరంగంలోనూ సక్సెస్ అయ్యాడు. ఆయా సంస్థలలో ఎన్నో పెట్టుబడులు పెట్టాడు. అలాగే అడ్వటైజ్మెంట్స్, బ్రాండ్ అంబాసిడర్‌గానూ సంపాదిస్తున్నాడు. ఇవే కాకుండా బుల్లితెరపై హిందీ రియాల్టీ షో బిగ్ బాస్ కు సల్మాన్ హోస్టింగ్ చేస్తున్నాడు. చివరిసారిగా అతడు టైగర్ 3 చిత్రంలో కనిపించాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
