AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12th Fail: ’12th ఫెయిల్’ మూవీ హీరో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో నటించాడని తెలుసా ?.. అసలు ఎవరీ విక్రాంత్ మాస్సే..

12th ఫెయిల్ సినిమాతో ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీ పరీక్ష యూపీఎస్సీని క్రాక్ చేయడానికి అతడు ఎలాంటి విద్యా ప్రయాణాన్ని ఎంచుకున్నాడు ?. ఆ దారిలో అతడు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు ?. చివరకు ఎలా విజయం సాధించాడు ? అనేది సినిమా. ఇటీవలే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాడు విక్రాంత్

12th Fail: '12th ఫెయిల్' మూవీ హీరో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో నటించాడని తెలుసా ?.. అసలు ఎవరీ విక్రాంత్ మాస్సే..
Vikranth Massey
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2024 | 8:34 PM

Share

విక్రాంత్ మాస్సే.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. మొన్నటివరకు సినిమాల్లో సహాయ నటుడు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో హీరో అంతే.. కానీ ఇప్పుడు అతడు పాన్ ఇండియా స్టార్. తన నటనతో ప్రేక్షకులను, సినీ విమర్శకులను అవాక్కయ్యేలా చేశాడు. 12th ఫెయిల్ సినిమాతో ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీ పరీక్ష యూపీఎస్సీని క్రాక్ చేయడానికి అతడు ఎలాంటి విద్యా ప్రయాణాన్ని ఎంచుకున్నాడు ?. ఆ దారిలో అతడు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు ?. చివరకు ఎలా విజయం సాధించాడు ? అనేది సినిమా. ఇటీవలే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాడు విక్రాంత్ మాస్సే. కానీ మీకు తెలుసా ?.. వెండితెరపై నటుడిగా ప్రయాణం ఆరంభించడానికి ముందే అతడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమని. అవును.. అప్పట్లో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడిన ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్లో నటించాడు. మరీ అతడి గురించి తెలుసుకుందామా.

విక్రాంత్ మాస్సే.. 3 ఏప్రిల్ 1987న జన్మించాడు. వెర్సోవాలోని సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో విద్యను పూర్తి చేశాడు. బాంద్రాలోని RD నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ చేశాడు. చిన్నవయసులోనే డాన్స్, నటనలో శిక్షణ తీసుకున్నాడు. 2007లో ధూమ్ మచావో ధూమ్ అనే హిట్ షోలో తన టెలివిజన్ అరంగేట్రం చేసాడు. రజత్ టోకాస్‌తో కలిసి ధరమ్ వీర్ షోలో ప్రిన్స్ ధరమ్‌గా నటించాడు విక్రాంత్. అలాగే హిందీలో సూపర్ హిట్ అయిన బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్లో శ్యామ్ సింగ్ అనే పాత్రలో కనిపించాడు. ఇందులో జగదీష్ సోదరి స్వప్న భర్తగా కనిపించాడు .

2010లో బాబా ఐసో వర్ ధూండో షోలో లీడ్‌గా కనిపించాడు. 2013లో విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించిన లూటెరాలో మొదటిసారి నటించాడు. 2015లో జోయా అక్తర్ సినిమాలో కనిపించాడు. 2017లో ఎ డెత్ ఇన్ ది గంజ్ మూవీలో హీరోగా నటించాడు విక్రాంత్. అలాగే హిందీలో అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించాడు. దీపికా పదుకొనేతో కలిసి మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఛపాక్ మూవీలో.. తాప్సీ పన్నుతో హసీన్ దిల్రుబా చిత్రాల్లో నటించాడు. గతేడాది మాత్రం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. నివేదికల ప్రకారం అతడు ఇప్పటివరకు రూ. 26 కోట్లు సంపాదించాడు. ఒక్కొ చిత్రానికి రూ. 75 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటారు.

ముంబైలో ఖరీదైన ఇల్లు ఉంది. రూ. 60.40 లక్షల విలువైన Volvo S90, INR 8.40 లక్షల విలువైన మారుతీ సుజుకి Dzire, రూ. 12 లక్షలకు పైగా విలువైన Ducati Monster కార్లను కలిగి ఉన్నాడు. విక్రాంత్ మాస్సే శీతల్ ఠాకూర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.