Vivek Agnihotri: పుష్ప, కాంతార సినిమాలపై అనురాగ్ కశ్యప్ మాటలను తప్పుబట్టిన కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్.. ఏమన్నారంటే..
తాజాగా అనురాగ్ మాటలను ఖండించారు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. అనురాగ్ మాటలను తప్పుపట్టిన ఆయన వ్యంగ్రాస్త్రాలు విసురుతూ ట్వీట్ చేశారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస డిజాస్టరలతో విలవిలలాడిపోతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలు మాత్రమే కాదు..భారీ బడ్జెట్ తో స్టార్ హీరో.. డైరెక్టర్ కాంబోలో వచ్చిన సినిమాలు సైతం అంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో బీటౌన్ ప్రొడ్యూసర్స్ భారీగా నష్టాలను చవిచూస్తున్నారు. లాల్ సింగ్ చద్దా, బ్రహ్మాస్త్ర, రామసేతు వంటి చిత్రాలు నిరాశపరిచాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం కావడానికి సౌత్ సినిమాలు కారణమంటూ ఇటీవల డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ఉదాహారణగా పుష్ప, కాంతార, కేజీఎఫ్ చిత్రాలను తీసుకున్నారు. ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సౌత్ సినిమా హిట్స్ భరించలేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటూ నెటిజన్స్ అనురాగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అనురాగ్ మాటలను ఖండించారు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. అనురాగ్ మాటలను తప్పుపట్టిన ఆయన వ్యంగ్రాస్త్రాలు విసురుతూ ట్వీట్ చేశారు.
అనురాగ్ వ్యాఖ్యలకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. ” బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకైక జెంటిల్ మ్యాన్ అభిప్రాయాలను నేను ఏమాత్రం ఏకీభవించను. మరి మీరు అంగీకరిస్తారా ? ” అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిని చూసిన పలువురు నెటిజన్స్ వివేక్ కు మద్దతు పలుకుతున్నారు. వివేక్ కామెంట్స్ పై అనురాగ్ ఇంకా స్పందించలేదు.
ఇటీవల గలాట్టా ప్లస్ రౌండ్ టేబుల్ సందర్భంగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీ నాశనం అవుతుందని. ప్రతి ఒక్కరు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని. దీంతో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అలాగే పుష్ప, కాంతార, కేజీఎఫ్ 2 చిత్రాలు పెద్ద విజయాన్ని అందుకున్నా.. ఇలాంటి సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనానికి కారణమవుతున్నాయని అన్నారు.
I totally totally totally disagree with the views of Bollywood’s one & only Milord.
Do you agree? pic.twitter.com/oDdAsV8xnx
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 13, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.