Farah Khan: వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వదలని మహమ్మారి.. కోవిడ్ బారిన పడిన ఫరా ఖాన్..
ఫిల్మ్ మేకర్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కోవిడ్ బారిన పడ్డారు. బుధవారం నిర్వహించిన పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని
ఫిల్మ్ మేకర్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కోవిడ్ బారిన పడ్డారు. బుధవారం నిర్వహించిన పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఫరా ఖాన్ తన ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. అయితే గతంలో ఆమె కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులను వేసుకుంది. అంతేకాకుండా.. ప్రస్తుతం తన టీంలోని సభ్యులందరూ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారని.. అయినా మళ్లీ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఫరా ఖాన్ తెలిపింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో.. ప్రస్తుతం జరిగిన విషయానికి నేను ఆశ్చర్యపోతున్నాను. నేను.. నా దిష్టి చుక్క వేసుకోలేదు. డబుల్ టీకాలు వేసినప్పటికీ.. ఎక్కువగా డబుల్ వ్యాక్సిన్డ్ వ్యక్తులతో పనిచేస్తున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది.
నాకు కరోనా సోకుతుందని అస్సలు ఊహించలేదు. దాదాపు నాతో సన్నిహితంగా మెలిగిన అందరికీ వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పాను.. ఒకవేళ ఎవరికైనా చెప్పడం మర్చిపోయుంటే దయచేసి పరీక్, చేయించుకోండి. వీలైనంత త్వరగా ఈ వైరస్‌ను జయిస్తానని ఆశిస్తున్నాను అని ఫరా ఖాన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఫరా ఖాన్ రియాలిటీ టీవీ షో జీ కామెడీకి జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే ఫరా పూర్తిగా కోలుకునే వరకు ఆమె స్థానంలో గాయని మికా సింగ్‌ను నియమించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇటీవల అమె సూపర్ డ్యాన్సర్ 4 షోకు గెస్ట్‌గా వచ్చారు. అలాగే ఫరాఖాన్ అతిథిగా శుక్రవారం రాబోయే కౌన్ బనేగా కరోడ్పతి 13 ఎపిసోడ్ చిత్రికరించినట్లుగా సమాచారం.
Viral Video: పెళ్లి మండపంలో వధువుతో వరుడు సరసాలు.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే.!