Thank God Movie: చిక్కుల్లో యంగ్ హీరో సినిమా.. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా మూవీపై కేసు.. ఎందుకంటే..
ఇటీవల విడుదలైన ట్రైలర్ లో చిత్రగుప్తుడిని అవహేళన చేసి.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 18న పిటిషినర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు కోర్టు తెలిపింది.
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) కలిసి నటించిన సినిమా థాంక్ గాడ్ చిక్కుల్లో పడింది. డైరెక్టర్ ఇంద్రకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఇందులో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. చిత్రగుప్తుడిని దైవంగా ఆరాధించే కాయస్థ సమాజం తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీశారంటూ ఈ సినిమాపై న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ యూపీలోని జాన్ పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో చిత్రగుప్తుడిని అవహేళన చేసి.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 18న పిటిషినర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు కోర్టు తెలిపింది.
ఇటీవల విడుదలైన థాంక్స్ గాడ్ ట్రైలర్‌లో, అజయ్ దేవగన్ చిత్రగుప్తుడి పాత్రలో కనిపించాడు. అందులో అతను బ్లేజర్, ప్యాంటు,చొక్కా ధరించి కనిపించాడు. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా యాక్సిడెంట్ కు గురికావడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ చిత్రగుప్తుడైన అజయ్ ను కలవడం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు.. చిత్రగుప్తుడి పాత్రలో జోకులు వేయడం.. అభ్యంతరకర పదజాలం వాడారంటూ శ్రీవాస్తవ ఆరోపించారు. పురాణాల ప్రకారం చిత్రగుప్తుడు న్యాయ దేవుడు. ఆయన ఒకరి పాపాలు, పుణ్యాలు లెక్కిస్తారు. మనుషులు వారి కర్మల ప్రకారం శిక్షించడం.. లేదా ప్రతిఫలమివ్వడం చేస్తుంటాడు. అలాంటి చిత్రగుప్తుడి పాత్రలో అజయ్ జోకులు వేయడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్పీని పెంచుకునేందుకు అభ్యంతరకర సన్నివేశాలు చీత్రీకరించారని. ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రీవాస్తవ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.