AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood: సెక్యూరిటీ కోసం లక్షలు ఖర్చు చేస్తోన్న స్టార్స్.. ఆ హీరో బాడీగార్డ్ జీతం రూ.2.7 కోట్లు.. ఎవరంటే..

సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చుట్టూ సెక్యూరిటీని దాటుకుని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడు అతడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Bollywood: సెక్యూరిటీ కోసం లక్షలు ఖర్చు చేస్తోన్న స్టార్స్.. ఆ హీరో బాడీగార్డ్ జీతం రూ.2.7 కోట్లు.. ఎవరంటే..
Bollywood Starts
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2025 | 7:59 AM

Share

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇన్నాళ్లు సల్మాన్ ఖాన్ కు మాత్రమే చంపుతామంటూ బెదిరింపు లేఖలు రావడంతో అతడి ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు .. ఇప్పుడు బీటౌన్ స్టార్ హీరోస్ ఇంటి వద్ద సైతం భద్రతను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం అర్దరాత్రి 2 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోనే అతడిపై ఓ ఆగంతకుడు దాడి చేశాడు. చుట్టూ సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని ఏకంగా సైఫ్ తనయుడు జేహ్ గదిలోకి ఓ దొంగ ప్రవేశించడం.. సైఫ్ పై దాడి చేయడంతో ఇప్పుడు స్టార్స్ భద్రత విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలీవుడ్ తారలు భద్రత కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ సెక్యురిటీ సిబ్బందికి భారీగానే జీతాలు ఇస్తున్నారు.

లైఫ్ స్టైల్ ఆసియా ప్రకారం.. సైఫ్ అలీ ఖాన్, అతని భార్య కరీనా కపూర్ బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్స్‌లో ఖాన్ కుటుంబంతో నివసిస్తున్నారు. ఈ ఇంటిని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ దర్శిని షా డిజైన్ చేశారు . సైఫ్ అలీ ఖాన్ నివసించే భవనంలో 3BHK ఫ్లాట్ ధర 10 కోట్ల కంటే ఎక్కువ. సైఫ్ అపార్ట్‌మెంట్ విలువ 55 కోట్లు. సైఫ్ అలీఖాన్ అపార్ట్‌మెంట్‌కు 24 గంటల భద్రత ఉంటుంది. ప్రతిచోటా సీసీ కెమెరాలు ఉన్నాయి . అనుమతి లేకుండా సైఫ్ ఇంట్లోకి ఎవరూ ప్రవేశించలేరు. కొన్ని నివేదికల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్ కుటుంబ భద్రత కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. వారికి ప్రైవేట్ బాడీ గార్డ్ కూడా ఉన్నారు.కానీ ఇప్పుడు సైఫ్ సెక్యూరిటీ సిస్టంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఓస్టార్ హీరో తన పర్సనల్ బాడీగార్డ్ కు ఏకంగా రూ.2.7 కోట్ల జీతం ఇస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఇంకెవరూ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. రవిసింగ్.. గత పదేళ్లుగా బాద్ షా షారుఖ్ బాడీగార్డ్. అతడికి రూ.2.7 కోట్లు జీతం ఉందట. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బాడీగార్డ్ అతనే. గుర్మీత్ సింగ్ జాలీ అకా షేరా 1995 నుండి సల్మాన్ ఖాన్ బాడీగార్డ్. అతడికి రూ.2 కోట్ల జీతం. యువరాజ్ ఘోర్పడే అమీర్ ఖాన్ సెక్యూరిటీ గార్డు. ఆయనకు 2 కోట్ల ప్యాకేజీ కూడా ఉంది. పోలీస్ కానిస్టేబుల్ జితేంద్ర షిండే 2015, 2021 మధ్య అమితాబ్ బచ్చన్‌కు బాడీగార్డ్‌గా పనిచేశాడు. అతడికి రూ.1.5 ప్యాకేజీకి ఉంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..