AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనల్ని మనం తక్కువగా భావించే యుగం పోయింది.. గ్లోబల్ లీడర్ మనమేః అభిషేక్ బచ్చన్

అభిషేక్ నటుడిగా, వ్యాపారవేత్తగానే కాకుండా సక్సెస్ ఫుల్ నిర్మాత కూడా. వధమ్ టీ, నాగిన్ హాట్ సాస్ వంటి ప్రముఖ వినియోగదారు బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టిన అభిషేక్ బచ్చన్, భారతీయ వ్యాపార దృశ్యంలో కొత్త శక్తిని సాధించారు. మేకిన్ ఇండియా ప్రోద్భలంతో వ్యాపారవేత్తగా మారిన అభిషేక్ బచ్చన్ తన పెట్టుబడి వ్యూహాలను పంచుకున్నారు.

మనల్ని మనం తక్కువగా భావించే యుగం పోయింది.. గ్లోబల్ లీడర్ మనమేః అభిషేక్ బచ్చన్
Abhishek Bachchan
Balaraju Goud
|

Updated on: Jan 18, 2025 | 12:51 PM

Share

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ పట్ల నటుడు అభిషేక్ బచ్చన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో అభిషేక్ బచ్చన్, వ్యాపారవేత్తగా పెట్టుబడిదారుడిగా మారారు. మేకిన్ ఇండియా ప్రోద్భలంతో వ్యాపారవేత్తగా మారిన అభిషేక్ బచ్చన్ తన పెట్టుబడి వ్యూహాలను పంచుకున్నారు. “మేక్ ఇన్ ఇండియా” చొరవ పట్ల తన ప్రశంసను వ్యక్తం చేశారు. ఇది తన వ్యవస్థాపక ప్రయాణంలో కీలకమైన కారకంగా భావించారు.

గత ఐదారు సంవత్సరాలుగా ఎక్కువగా ఉత్తేజపరిచేది భారతదేశంలో సాధిస్తున్న ప్రగతి అన్నారు. భారతదేశం నుండి బయలుదేరిన కంపెనీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం కోసం పనిచేస్తున్నాయన్నారు. మేక్ ఇన్ ఇండియా చాలా స్ఫూర్తిదాయకమని, మనం మనల్ని మనం తక్కువ అని భావించే యుగం ఇప్పుడు ముగిసిందన్నారు. ప్రస్తుతం వ్యాపార రంగంలో చేసే ఏ పనిలోనైనా మార్కెట్ లీడర్‌గా ఉన్నామని అభిషేక్ బచ్చన్ అన్నారు.

వధమ్ టీ, నాగిన్ హాట్ సాస్ వంటి ప్రముఖ వినియోగదారు బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టిన అభిషేక్ బచ్చన్, భారతీయ వ్యాపార దృశ్యంలో కొత్త శక్తిని, విశ్వాసం సాధించానన్నారు. ఈ కొత్త ఉత్సాహం, విశ్వాసం గత దశాబ్దాల భావజాలానికి భిన్నంగా ఉన్నాయని, ప్రస్తుతం విజయవంతం కావాలంటే ఆవిష్కరణలు విదేశాల నుంచి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. “యూరప్ లేదా అమెరికాలో చదువుకోకపోతే ముందు వరుసలో ఉండలేమనే ఆలోచన ఒకప్పుడు ఉండేది” అని బచ్చన్ అన్నారు. “కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, భారతీయుల నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు” లభించదన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…