AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Expo 2025: హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ విలర్.. డిజైన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కొనసాగుతోంది.. రెండో రోజు (జనవరి 18, 2025) పలు ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీలు కొత్త కొత్త మోడల్ వాహనాలను ప్రదర్శిస్తున్నారు.. ఎలక్ట్రిక్ నుంచి సాధారణ వాహనాల వరకు ఎన్నో ఆకర్షణీయమైన మోడళ్లను ప్రదర్శస్తున్నారు..

Auto Expo 2025: హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ విలర్.. డిజైన్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..
Bharat Mobility Global Expo 2025
Shaik Madar Saheb
|

Updated on: Jan 18, 2025 | 2:02 PM

Share

ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కొనసాగుతోంది.. రెండో రోజు (జనవరి 18, 2025) పలు ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీలు కొత్త కొత్త మోడల్ వాహనాలను ప్రదర్శిస్తున్నారు.. ఎలక్ట్రిక్ నుంచి సాధారణ వాహనాల వరకు ఎన్నో ఆకర్షణీయమైన మోడళ్లను ప్రదర్శస్తున్నారు.. మొబిలిటీ రంగంలో వచ్చిన అనేకమైన కొత్త కొత్త సాంకేతికలను జోడించిన వాహనాలను ప్రముఖ కంపెనీలు ప్రదర్శిస్తూ అందరినీ.. ఆకట్టుకుంటున్నాయి.. దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధునాతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, మైక్రో ఫోర్-వీలర్ కాన్సెప్ట్ మోడల్‌లను ఆవిష్కరించింది.

ఈ మేరకు దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ మోటార్ కంపెనీ (హ్యుందాయ్) శనివారం టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత మొబిలిటీ మార్కెట్‌లోకి కీలక ఆవిష్కరణలను ప్రవేశపెట్టడానికి TVS మోటార్ కంపెనీ లిమిటెడ్ (TVS మోటార్) జతకట్టింది.. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో హ్యుందాయ్ అధునాతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, మైక్రో ఫోర్-వీలర్ కాన్సెప్ట్ మోడల్‌లను ఆవిష్కరించింది. అంతకుముందు హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారును కూడా ప్రదర్శించింది.

వీడియో చూడండి..

హ్యుందాయ్.. మోటార్ డిజైన్, ఇంజనీరింగ్, సాంకేతికతను అందించే సామర్థ్యాన్ని అన్వేషిస్తోంది.. దీనికోసం TVS మోటార్ వాహనాల తయారీ, మార్కెటింగ్‌తో ముందుకు కలిసి ప్రయాణించనుంది. “TVS మోటార్‌తో కలిసి నాలుగు చక్రాల కోసం ప్రపంచ అవకాశాలను అన్వేషిస్తూ.. త్వరితగతిన ఆవిష్కరణలు చేస్తున్న భారతదేశ స్ఫూర్తితో సహజమైన కార్యాచరణను మిళితం చేస్తూ, స్థానికంగా మూడు చక్రాల వాహనాన్ని ఉత్పత్తి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని హ్యుందాయ్ అండ్ జెనెసిస్ గ్లోబల్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హెడ్ సాంగ్యూప్ లీ అన్నారు.

ఈ వినూత్న ఆవిష్కరణలు భారతదేశం డైనమిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ల్యాండ్‌స్కేప్‌లో భాగంగా సౌలభ్యం, స్థిరత్వం, అనుకూలతకు ప్రాధాన్యతనిచ్చే మొబిలిటీ సొల్యూషన్‌లను పునర్నిర్మించడం ద్వారా ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’ దృష్టికి హ్యుందాయ్ మోటార్ అచంచలమైన నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు. “హ్యుందాయ్ మోటార్ అనేది కస్టమర్-సెంట్రిక్ బ్రాండ్, భారతదేశంలోని ప్రజల పట్ల శ్రద్ధ వహించడం మా మొదటి లక్ష్యం. ఈ నిబద్ధత భారతదేశ విశిష్ట వాతావరణానికి అనుగుణంగా మైక్రో-మొబిలిటీ సొల్యూషన్‌ల రూపకల్పనను అన్వేషించడానికి, ఆలోచనాత్మకమైన డిజైన్ ద్వారా చలనశీలత అనుభవాలను మెరుగుపరిచేందుకు ఐకానిక్ త్రీ-వీలర్‌ను పునఃరూపకల్పన చేయడానికి మమ్మల్ని పురికొల్పింది” అని లీ జోడించారు.

“అర్బన్ మొబిలిటీ భవిష్యత్తును రూపొందించడానికి హ్యుందాయ్ మోటార్‌తో భాగస్వామ్యాన్ని నెలకొల్పడం పట్ల TVS గర్వంగా ఉంది” అని TVS మోటార్ కంపెనీ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ శరద్ మిశ్రా అన్నారు.

హ్యుందాయ్ మోటార్ మైక్రో మొబిలిటీ కాన్సెప్ట్ వాహనాలు బ్రాండ్ కస్టమర్-సెంట్రిక్ డిజైన్, మానవ-కేంద్రీకృత ఇంజనీరింగ్‌కు నిదర్శనం.. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కాన్సెప్ట్ ఇరుకైన వీధుల్లో అప్రయత్నంగా నావిగేట్ చేయడానికి రూపొందించారు. వాహనం బాడీ, ఎత్తు సర్దుబాటు చేయనున్నారు. వర్షాకాలంలో నీటితో నిండిన వీధుల్లో ప్రయాణించడానికి వీలుగా దీనిని రూపొంచారు. ‘ఆకాషి బ్లూ’ కలర్ లో ఆధునాతనమైన సీటింగ్ తోపాటు.. పెద్ద టైర్లు కఠినమైన భూభాగాలపై కూడా సున్నితంగా ప్రయాణించేలా చేస్తాయని.. సిబ్బంది తెలిపారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఎక్స్‌పో, ఇది మొబిలిటీ రంగంలోని అన్ని అంశాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. జనవరి 17 నుంచి 22 వరకు భారత్ మండపం యశోభూమి, ఇండియా ఎక్స్‌పో సెంటర్, గ్రేటర్ నోయిడాలోని మార్ట్ అనే మూడు ప్రదేశాలలో ఎక్స్‌పో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 9 ప్రదర్శనలు, 20కి పైగా సమావేశాలు, పెవిలియన్లు ఉంటాయి. దీనితో పాటు, వివిధ రాష్ట్రాల ప్రత్యేక సమావేశాలు మొబిలిటీ రంగంలో తమ విధానాలు, పథకాలను ప్రదర్శిస్తాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..