AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: మరో బ్లాస్టింగ్ ఫీచర్‌తో వాట్సాప్.. ఇకపై వినాల్సిన అవసరం లేదు..

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు WhatsApp యాప్‌ని ఉపయోగిస్తున్నారు. అందరూ సులువుగా ఉపయోగించే వాట్సప్ యాప్.. అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో ఒకటిగా ఉంది.. అయితే.. వాట్సాప్ సంస్థ.. వినియోగదారుల కోసం అద్బుతమైన ఫీచర్లను ప్రవేశపెడుతూ మరింత ఆకట్టుకుంటోంది.. మరో సరి కొత్త ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకోండి..

WhatsApp: మరో బ్లాస్టింగ్ ఫీచర్‌తో వాట్సాప్.. ఇకపై వినాల్సిన అవసరం లేదు..
Whatsapp
Rakesh Reddy Ch
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jan 18, 2025 | 11:52 AM

Share

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది WhatsApp యాప్‌ని ఉపయోగిస్తున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా యాప్‌లలో వాట్సాప్ ఒకటిగా ఉంది.. అందుకే.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రోజుకో కొత్త ఫీచర్ తో దుమ్ము రేపుతుంది వాట్సాప్.. వేరే సోషల్ మీడియా ప్లాట్ ఫాం వైపు వినియోగదారులు వెళ్లకుండా చేసే లాంగ్ స్టాండింగ్ కసరత్తే అయినా… ఎప్పటికప్పుడు ఆప్షన్స్ మారుస్తూ యూజర్స్‌ను మరింత ఆకర్షిస్తోంది.. ఇక తాజాగా వాట్సాప్ లో ఉన్న చాలామంది ఎదుర్కొంటున్న ఓ సమస్యకు టెక్నాలజీతో పుల్‌స్టాప్ పెట్టింది. వాట్సాప్‌లో టెక్స్ట్ మెసేజ్‌లతోపాటు వాయిస్ మెసేజ్‌లు పంపుకోవచ్చు అనే విషయం అందరికీ తెలుసు. చాలామంది బిజీగా ఉన్నప్పుడు ఈ వాయిస్ మెసేజ్‌లను వాడుతున్నారు.

చాలా పెద్ద టెక్స్టింగ్ మెస్సెజ్ చేసే బదులు చిన్న వాయిస్ మెసేజ్‌లతో చెప్పాలనుకున్న విషయాలు చెప్పేస్తున్నారు. కానీ ఇందులో ఒక సమస్య ఉంది.. ఆ వాయిస్ మెసేజ్లను వినాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. మీటింగ్‌లో ఉన్నప్పుడు, సినిమా థియేటర్లో ఉన్నప్పుడు లేదా వ్యక్తిగతంగా వచ్చే వాయిస్ మెసేజ్‌లను వినాలి అనుకున్నప్పుడు సాధ్యం కావడం లేదు.

ఒకవేళ పంపిన వాయిస్ మెసేజ్ ఏదైనా అర్జెంట్ మేటర్ అయిన అప్పుడు వినలేని పరిస్థితి ఉంటుంది.. పబ్లిక్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు వినిపించదు కూడా… అవతలి వ్యక్తికి టైప్ చేసే సమయం లేక అత్యవసర సమయంలో పంపే వాయిస్ మెసేజ్లను కూడా కొంతమంది వినలేకపోతున్నారు. దీనికి సొల్యూషన్ గా వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లని టెక్స్ట్ రూపంలో మార్చే ట్రాన్స్క్రిప్ట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

ట్రాన్స్‌క్రిప్ట్ ఆప్షన్.. మీకు వచ్చే వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్ రూపంలోకి మార్చి చూపిస్తుంది. అది కూడా ఒక్క సెకండ్ లోపే.. ప్రస్తుతానికి నాలుగు భాషల్లో ఈ సదుపాయం కల్పించింది. ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, పోర్చుగీస్ భాషల్లో ఈ ట్రాన్స్క్రిప్ట్ అందుబాటులో ఉంది. ఇందుకోసం వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి… చాట్స్ అనే ఆప్షన్ లో మెసేజెస్ ట్రాన్స్క్రిప్ట్ అనే ఆప్షన్ ని ఆన్ చేసుకోవాలి.

ఆ తర్వాత మీకు వచ్చిన వాయిస్ మెసేజ్ లపై క్లిక్ చేసి హోల్డ్ చేస్తే మీకు వచ్చే ఆప్షన్స్ లో మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అని వస్తుంది. సింపుల్‌గా దాని పైన క్లిక్ చేస్తే మీ వాయిస్ మెసేజ్ మొత్తం దాని కింద టెక్స్ట్ రూపంలో మీకు కనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్ గా ఈ ఫీచర్ ప్రస్తుతానికి పనిచేస్తుంది. త్వరలోనే భారతీయ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని వాట్సప్ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే