Tollywood: అయ్యో పాపం.. టీవీ షోతో కోట్లు సంపాదించాడు.. ఆ రెండు సినిమాలతో మొత్తం పోగొట్టుకున్న కమెడియన్..

కపిల్ శర్మ షో.. ఇప్పుడు టీవీల్లో ఎక్కువగా ఆదరణ సొంతం చేసుకున్న షో. ఇప్పటికే ఈ షోలో ఎంతోమంది సెలబ్రెటీస్ వచ్చి తమ సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ షో ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం నిర్మాతగా మారి పోగొట్టుకున్నారట.

Tollywood: అయ్యో పాపం.. టీవీ షోతో కోట్లు సంపాదించాడు.. ఆ రెండు సినిమాలతో మొత్తం పోగొట్టుకున్న కమెడియన్..
Kapil Sharma
Follow us

|

Updated on: Oct 25, 2024 | 1:46 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ సెలబ్రెటీలలో కపిల్ శర్మ ఒగకరు. కపిల్ శర్మ టీవీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన షో. గత దశాబ్దానికి పైగా టీవీలో కామెడీ షోను హోస్ట్ చేస్తూ జనాలకు దగ్గరయ్యాడు కపిల్ శర్మ. అంతకుముందు అతడు స్టాండమ్ కమెడియన్. ప్రస్తుతం ఈ టాక్ షో ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. కపిల్ శర్మ టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా కూడా పేరు పొందాడు. బుల్లితెర ద్వారా వందల కోట్లు సంపాదించిన కపిల్ శర్మ సినిమాల్లోకి వెళ్లి మొత్తం పోగొట్టుకున్నాడట. ‘ఫీల్ ఇట్ ఇన్ యువర్ సోల్’ పేరుతో యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కపిల్ శర్మ.. క్కడ తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల గురించి అనేక విషయాలను పంచుకున్నాడు.

అలాగే తన జీవితంలో వచ్చిన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. “నేను కేవలం 1200 రూపాయలు జేబులో పెట్టుకుని ముంబైకి వచ్చాను. చాలా రోజులు నేను ఒక్క పూట కూడా తినడానికి ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత కపిల్ శర్మ షో ద్వారా సక్సెస్ అయ్యాను. అప్పుడు నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఇంత డబ్బు ఉంటే నేను సినిమా నిర్మాతగా మారొచ్చు అని భావించి రెండు సినిమాలు చేశాను. కానీ డబ్బుంటే నిర్మాత కాలేరని ఆ తర్వాత అర్థమైంది. నిర్మాతగా మారాలంటే భిన్నమైన ఆలోచన, ఫ్యాషన్, నాలెడ్జ్ ఉండాలని అర్థమైంది. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పెట్టి సినిమా చేశాను. కానీ ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో నా దగ్గరున్న డబ్బు మొత్తం పోయింది. నా బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యింది. నేను సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నాను. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నా కష్ట సమయంలో నా భార్య గిన్నీ నాకు చాలా సహాయం చేసింది. డబ్బు పోవడంతో పాటు మరికొన్ని విషయాలు కూడా నన్ను డిప్రెషన్‌కు గురి చేశాయి. జరిగినదంతా మంచి కోసమే, నేను దాని నుండి గొప్ప పాఠాలు నేర్చుకున్నాను. ఇప్పుడు మళ్లీ సరైన దారిలోకి వచ్చాను” అని చెప్పుకొచ్చారు.

టీవీ ప్రపంచంలోని ప్రముఖ తార రూపాలి గంగూలీని కపిల్ శర్మ అధిగమించి అత్యంత ధనిక టీవీ స్టార్‌గా అవతరించాడు. ఆయన ఆస్తి విలువ 300 కోట్లకు పైగానే ఉంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ ప్రసారమవుతోంది.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ..
పొదల మాటున వింత శబ్దాలు.. ఉబ్బిన పొట్టతో కనిపించిన కొండచిలువ..
ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..
ఆకాశంలో అద్భుత దృశ్యం.! మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల తరువాతే..
స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!
స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!
దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.
బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..
బాలీవుడ్‌ గురించి సాయిపల్లవి సంచలన కామెంట్స్‌.! వీడియో వైరల్..
కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..
కరకరలాడే చిప్స్‌పై గీతలు ఎందుకుంటాయి.? ఆలూ చిప్స్‌ తింటే మజాయే..
ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..
చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..
చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..
టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం
టాలివుడ్‌లో దీపావళి జాతర! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షం
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!
లేదు లేదంటూనే.. మళ్లీ ఫాలోఅవడం ఏంటో.? ఐశ్వర్య అభిషేక్ రచ్చ.!