AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobikwik: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికి మొబిక్విక్ గుడ్‌న్యూస్.. అదిరిపడే వడ్డీ రేటు ప్రకటన

భారతదేశంలో చాలా ఏళ్లుగా పెట్టుబడిదారులు ఫిక్స్ డిపాజిట్ వంటి స్థిర ఆదాయ పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. పెట్టుబడికి రక్షణతో పాటు నమ్మకమైన రాబడికి హామీ ఉండడంతో ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఎఫ్‌డీల్లో పెట్టుబడికి పెడుతూ ఉంటారు. ఇలాంటి వారిని ఆకట్టుకునేందుకు కొన్ని బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్స్ ద్వారా నమ్మలేని వడ్డీ రేటును అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ యాప్ అయిన మొబిక్విక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులకు ఏకంగా 9.5 శాతం వడ్డీను ఆఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మొబిక్విక్ ఎఫ్‌డీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Mobikwik: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికి మొబిక్విక్ గుడ్‌న్యూస్.. అదిరిపడే వడ్డీ రేటు ప్రకటన
Fixed Deposit
Nikhil
|

Updated on: Oct 27, 2024 | 6:45 PM

Share

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్ల కోసం చూస్తున్నవారికి మొబిక్విక్ శుభవార్త చెప్పింది. ఫైనాన్షియల్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ మొబిక్విక్ తన మొబైల్ యాప్‌లో ఆర్థిక సేవల సంస్థల భాగస్వామ్యంతో ఇన్‌స్టంట్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9.5 శాతం వడ్డీని అందిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా తమ వినియోగదారులను పొదుపు మార్గం వైపు తిప్పడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మొబిక్విక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వినియోగదారులకు రూ. 1,000 నుంచి పెట్టుబడిని ప్రారంభించి, కొత్త బ్యాంక్ ఖాతాను తెరవకుండానే సంవత్సరానికి 9.5 శాతం వరకు రాబడిని పొందవచ్చని పేర్కొంటున్నారు. వినియోగదారులు ఏడు రోజుల నుంచి 60 నెలల వరకు డిపాజిట్ వ్యవధిని ఎంచుకోవచ్చు. 

మొబిక్విక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీలను అందించడానికి మహీంద్రా ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే మొబిక్విక్ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇతర నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో కలిపి ఈ ఎఫ్‌డీలను అందిస్తుంది. భారతదేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఉన్న ఆదరణ నేపథ్యంలో వారికి మెరుగైన వడ్డీ రేటును అందించేలా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు మొబిక్విక్ సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ చెబుతున్నారు. ముఖ్యంగా ఫోన్ ద్వారానే ఎఫ్‌డీ చేసే సదుపాయం ఉండడంతో మారుమూల ప్రాంత ప్రజలు కూడా బ్యాంకును సందర్శించే అవసరం లేకుండా ఎఫ్‌డీ చేయవచ్చని చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రయోజనలు

  • పెట్టుబడి పెట్టడం లేదా పొదుపు చేయడం ప్రారంభించడానికి మీరు కొత్త బ్యాంక్ ఖాతాను తెరవడం ద్వారా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
  • మొబిక్విక్ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లు 9.5 శాతం వరకు ఉంటాయి. ఇది చాలా బ్యాంకుల కంటే చాలా ఎక్కువ, వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుంది.
  • మీ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఎఫ్‌డీకు సంబంధించిన పదవీకాలాన్ని ఎంచుకునే ఎంపిక కూడా ఉంది. ఇది పొదుపును అనువైనదిగా చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..