Diwali Movies: టాలివుడ్‌లో దీపావళి జాతర.! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షమే..

Diwali Movies: టాలివుడ్‌లో దీపావళి జాతర.! చిన్న సినిమాలే కానీ పేలితే కోట్లు వర్షమే..

Anil kumar poka

|

Updated on: Oct 27, 2024 | 9:02 AM

దీపావళి చిన్న సినిమాల జాతర జరగబోతుంది. అలాగని మరీ చిన్నోళ్లైతే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా పేలితే కనీసం 50 కోట్లు వసూలు చేసే సత్తా ఆ సినిమాలకు ఉంది. .. హీరోలే ఈ దీపావళిని హ్యాండోవర్ చేసుకున్నారు. మరి ఈ పండక్కి క్రాకర్స్ పేల్చబోతున్న ఆ హీరోలెవరు..?

లక్కీ భాస్కర్‌:
ఈ దీపావళి ఎన్ని సినిమాలు వచ్చినా.. అగ్ర తాంబూలం మాత్రం లక్కీ భాస్కర్‌దే. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మహానటి, సీతారామం తర్వాత హ్యాట్రిక్‌పై కన్నేసారీయన. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.దుల్కర్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్,ఫాలోయింగ్ ఉంది…
తను ఎప్పుడు తెలుగు లో సినిమా తో వచ్చిన అది బాగుంటుందనే నమ్మకం అయితే ఆడియన్స్ లో ఉంది…..మహానటి లో అయినా అచ్తింగ్ కి వో అన్నారు..సీత రామం లో అయినా ప్లే చేసిన రామ్ క్యారెక్టర్ ని ఇంకా జనాలు మర్చిపోలేరు…మరి ఈసారి లక్కీ భాస్కర్ ఎలా ఎంగేజ్ చేస్తాడో… దీవాలి కి ఏ బాంబు పేలుస్తాడో చూడాలి

‘క’:
ఇక అక్టోబర్ 31నే లక్కీ భాస్కర్‌కు పోటీగా క అంటూ వెరైటీ టైటిల్‌తో వచ్చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇలాంటి సమయంలో తన మార్కెట్ కంటే రెండు మూడింతలు ఎక్కువ ఖర్చుతో ఈయన చేస్తున్న పాన్ ఇండియన్ సినిమా క. సుజీత్ సందీప్ ద్వయం దీనికి దర్శకులు. ‘క’ సినిమా ప్రమోషన్స్ భారీగానే చేసుకుంటున్నారు కిరణ్.ఇప్పటివరకు కిరణ్ సినిమాలు ఒకలా ఉంటెఈ సినిమా ఇంకోలా ఉంటుందేమో అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే సినిమా త్వరగా చూడాలన్న ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంది.చాలా కాలం తరువాత కిరణ్ మళ్ళి హిట్ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి

బఘీరా:
ఈ దీపావళి కే రానున్న మరో సినిమా బఘీరా. దీనికి ప్రశాంత్ నీల్ బ్రాండ్ ఉంది. శ్రీ మురళీ హీరోగా నటిస్తున్న బఘీరాకు ప్రశాంత్ నీల్ కథ అందించారు. ఉగ్రం సినిమాతో కన్నడ సినీరంగంలోకి దర్శకుడిగా పరిచయమైన నీల్.. కేజీఎఫ్ చాప్టర్ 1, 2 చిత్రాలతో దేశవ్యాప్తంగా టాప్ దర్శకులలో ఒకరిగా మారారు. కేజీఎఫ్ చిత్రాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి సలార్ మూవీ మరోసారి భారీ హిట్ కొట్టాడు. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాల కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ కన్నడలో స్టార్ హీరో.
. కన్నడలో శ్రీమురళి తన మొదటి సినిమా చంద్ర చకోరితోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకుంటూ రోరింగ్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. కన్నడ చిత్రపరిశ్రమలో అతడికి మంచి పాలోయింగ్ ఉంది. 2008లో శ్రీ మురళికి ప్రశాంత్ నీల్ అక్క విద్యతో వివాహం జరిగింది. ప్రశాంత్ నీల్ కు మొదటి ఛాన్స్ ఇచ్చింది కూడా శ్రీ మురళినే.

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ఉగ్రంలో శ్రీమురళినే హీరో. ప్రస్తుతం అతడు బఘీర సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే తెలుగులోనూ ఈ మూవీ విడుదల కానుంది. దీంతో శ్రీ మురళి ఇప్పుడు తెలుగులోనూ ప్రమోషన్స్ చేస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కాబోతుంది.

అమరన్:
ఇక అక్టోబర్ 31నే రాబోతున్న మరో సినిమా అమరన్. ఇక తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. దీనిపై తెలుగులోనూ మంచి అంచనాలే ఉన్నాయి. మొత్తానికి ఈ దివాళి మీడియం రేంజ్ సినిమాలకు వరంగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.