Cheetahs: చిరుతే కదా అని చంపేస్తే.! మొన్న నల్లమల అడవుల్లో చిరుత మృతి..
అడవులను వదిలి జనావాసాల్లోకి వస్తున్న వన్యమృగాలు మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్ మియాపూర్‌లోని మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత తిరుగుతోందన్న వార్త కలకలం రేపింది. అయితే అది చిరుత కాదు, అడవి పిల్లి అని అటవీ అధికారులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మధ్య కాలంలో చిరుతలు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నాయి. ఇటీవలే నల్లమల అడవుల్లో ఓ చిరుత మృతి చెందింది. అయితే అది వయసు రిత్యా వృద్ధాప్య బాధలతో చనిపోయి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావించారు. ఈ ఘటన మరువక ముందే చిత్తూరుజిల్లా కౌండిన్య అభయారణ్యంలో మరో చిరుత మృతి చెందింది. దీనిపై పోలీసులు, అటవీ సిబ్బంది పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని కౌడన్య అభయారణ్యంలో చిరుత మృతి చెందింది. యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది చిరుత మృతి చెందినట్లు గుర్తించింది. ఫారెస్ట్ ఏరియాలో చిరుత మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. చిరుత నోటిలోని పళ్ళు, పంజా లోని గోర్లు పీకేసినట్లు గుర్తించిన అధికారులు చిరుత ఎలా చనిపోయిందన్న దానిపై ఆరాధిస్తున్నారు. మరోవైపు వేటగాళ్ళ ఉచ్చుకు బలైనట్లు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు డీ కంపోజైన చిరుత కు మృతిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయ్యాక చిరుత మృతికి గల కచ్చితమైన కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.