Israel-Lebanon War: ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..

Israel-Lebanon War: ప్రాణభయంతో పరార్‌.! లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు..

Anil kumar poka

|

Updated on: Oct 27, 2024 | 9:23 AM

ఇజ్రాయెల్ -లెబనాన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటినే టార్గెట్ చేసింది హెజ్బొల్లా. ఆయన నివాసమే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది. ఈ క్రమంలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక కేంద్రాలే లక్ష్యంగా వరుస దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా సహా పలువురు కీలక నేతలు చనిపోయారు.

ఇజ్రాయెల్ -లెబనాన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోన్న నేపథ్యంలో హెజ్‌బొల్లా డిప్యూటీ చీఫ్‌ గా వ్యవహరిస్తున్న నయీమ్‌ ఖాసిమ్‌ ప్రాణ భయంతో లెబనాన్‌ నుంచి పరార్‌ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఇరాన్‌కు పారిపోయినట్లు సమాచారం. నయీమ్‌ అక్టోబర్‌ 5నే బీరుట్‌ను వీడినట్లు తెలుస్తోంది. లెబనాన్, సిరియా పర్యటనకు వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరగచి విమానంలోనే ఆయన బీరుట్ నుంచి ఇరాన్‌కు వెళ్లి ఉంటారని స్థానిక మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇజ్రాయెల్ ఆయనను హత్య చేసే అవకాశం ఉందన్న ఇస్లామిక్ రిపబ్లిక్ నేతల హెచ్చరికలతోనే నయీమ్‌ లెబనాన్‌ను వీడినట్లు సమాచారం. కాగా సెప్టెంబర్‌ 27న ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హతమయ్యారు. నస్రల్లా మృతి తర్వాత నయీమ్‌ ఖాసిమ్‌ మూడుసార్లు ప్రసంగించారు. అందులో ఒకటి బీరుట్‌ నుంచి కాగా, మిగతా రెండు టెహ్రాన్‌ నుంచి మాట్లాడారు. నజ్రాల్లా మరణం తర్వాత ఇజ్రాయెల్‌కు నయీమ్‌ టార్గెట్‌గా ఉన్నాడు. దీంతో ఆయన ప్రాణ భయంతో లెబనాన్‌ను వీడినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.

మిలిటెంట్‌ గ్రూపుల్లో ఒకటైన షియా రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో నయీమ్‌ ఖాసిమ్‌ ఒకరు. ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుందన్న భయంతో నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వేళ.. సభలు, ఇంటర్వ్యూలతోపాటు ఇతర బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నజ్రల్లా మరణం తర్వాత హెజ్‌బొల్లా చీఫ్‌ బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.