ఆకాశంలో అద్భుత దృశ్యం.! ఇప్పుడు మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల వరకు చూడలేరు!

ఆకాశంలో అద్భుత దృశ్యం.! ఇప్పుడు మిస్సయితే మళ్లీ.. 80 వేల ఏళ్ల వరకు చూడలేరు!

|

Updated on: Oct 27, 2024 | 11:11 AM

ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందుచేస్తోంది. జనవరి 2023లో గుర్తించిన సీ/2023-ఏ3 అనే తోకచుక్క ప్రస్తుతం భారత్ నుంచి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఔత్సాహికులు దీనిని సాధారణ కళ్లతో వీక్షించవచ్చునని, ఇది మసకబారిన బంతిలా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే టెలిస్కోప్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని సూచించారు.

సీ/2023-ఏ3 తోకచుక్క సెప్టెంబరు 28, 2024న సూర్యుడికి దగ్గరగా చేరింది. ఆ రోజు నుంచి సూర్యుడికి దూరంగా కదలడం ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రస్తుతం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తోకచుక్క అరుదైన ఖగోళ ఘట్టమని, మరో 80,000 సంవత్సరాల వరకు ఇది కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత దశాబ్దకాలంలో ఇదే అత్యంత ప్రకాశవంతమైన తోకచుక్క అని పేర్కొన్నారు.

భారతదేశం అంతటా ఈ తోకచుక్క కనిపిస్తుందని తెలిపారు. అక్టోబర్ 14-24 మధ్య ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపిన శాస్త్రవేత్తలు, ఈ దృశ్యాన్ని తెల్లవారుజామున వీక్షించడం ఉత్తమమని సూచించారు. ఈ తోకచుక్క సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిశలో కూడా కనిపిస్తుందని చెప్పారు. ఈ తోకచుక్కకు సంబంధించి ఖగోళ ఫోటోగ్రాఫర్లు, ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు తీసిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి కొందరు ఈ ఫొటోలు తీశారు. ఈ చిత్రాలలోని తోకచుక్క పొడవాటి తోకతో మెరుస్తూ కనిపిస్తోంది. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఆకాశం స్పష్టంగా ఉన్న లడఖ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి తోకచుక్క స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!