Salman Khan: బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులను లెక్క చేయని సల్మాన్‌ ఖాన్.. దుబాయ్‌కు పయనం.. ఎందుకంటే?

సల్మాన్ ఖాన్  సినిమాల విషయానికి వస్తే.. త్వరలోనే 'సికిందర్'తో తో అభిమానులను పలకరించనున్నాడీ స్టార్ హీరో. ఈ చిత్రంలో సల్మాన్‌ సరసన రష్మిక మందన్నహీరోయిన్ గా కనిపించనుంది. సౌతిండియన్ డైరెక్టర్ మురగదాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు అట్లీ దర్శకత్వంలోనూ సల్మాన్ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది.

Salman Khan: బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులను లెక్క చేయని సల్మాన్‌ ఖాన్.. దుబాయ్‌కు పయనం.. ఎందుకంటే?
Lawrence Bishnoi Vs Salman Khan
Follow us

|

Updated on: Oct 27, 2024 | 6:50 PM

కృష్ణజింకలను వేటాడిన కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు. కృష్ణ జింకలను సొంత కుటుంబ సభ్యుల్లా భావించే బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ను హతమారుస్తామంటూ పలు సార్లు బెదిరింపు లేఖలు పంపిస్తున్నారు. ఈ మధ్యన ఈ బెదిరింపుల పర్వం తారా స్థాయికి చేరుకుంది. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ ప్రత్యేక స్నేహితుడు, సీనియర్ నాయకుడు బాబా సిద్ధిఖీ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. బాబాను తామే హతమార్చామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ బహిరంగంగా ప్రకటించింది కూడా. దీంతో సల్మాన్ ఖాన్ ఇంటి బయట భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు. ప్రస్తుతం ఖాన్ కుటుంబం భయాందోళనలో ఉంది. అయితే బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు వస్తున్నప్పటికీ.. సల్మాన్ ఖాన్ యథావిధిగా తన సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అనుకున్న సమయానికి పూర్తి చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ఇటీవల ‘సింగం ఎగైన్’ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇది కాకుండా ఈ స్టార్ హీరో ఇప్పుడు దుబాయ్ కూడా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపుల కారణంగా సల్మాన్ ఖాన్ ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రత మధ్య ముంబైలో తిరుగుతున్నారు. ‘సిఖందర్’ సినిమా షూటింగ్ ముంబై బయట జరగాల్సి ఉంది. కానీ దాన్ని రద్దు చేసి ముంబైలో సెట్ వేసినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, సల్మాన్ ఖాన్ త్వరలో దుబాయ్‌లో జరిగే ఒక ఈవెంట్ కోసం బయలుదేరనున్నారు.

‘దబాంగ్ రీలోడెడ్’ కోసం సల్మాన్ ఖాన్ దుబాయ్ వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 7న ఈ షో ప్రారంభం కానుందని సమాచారం. సల్మాన్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి షూటింగ్‌లు, షోలు అన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తున్నాడు.

దబాంగ్ రీలోడెడ్’ కోసం సల్మాన్ ఖాన్ దుబాయ్ వెళ్లనున్నాడని వార్తలు వచ్చాయి. డిసెంబర్ 7న షో ప్రారంభం కానుందని సమాచారం. సల్మాన్ ఖాన్‌తో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా, సునీల్ గ్రోవర్, అస్తా గిల్, మనీష్ పాల్ కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. దుబాయ్ హార్బర్‌లో ఈ షో జరగనుంది. అందుతున్న సమాచారం మేరకు షో టిక్కెట్ల విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ పూర్తి భద్రతతో వస్తాడని అంటున్నారు. అయితే ఏవైనా సమస్యలు తలెత్తితే, ప్రోగ్రామ్‌లో కొన్ని మార్పులు ఉండవచ్చు… అని కూడా చెప్పారు. మీకు చెప్పాలంటే, సల్మాన్ ఖాన్ ‘ఎగైన్ సింగం’ షూటింగ్ కూడా పూర్తి చేసాడు. ఈ సినిమాలో ఆయన అతిథి నటుడిగా కనిపించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!