Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sago Benefits: స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!

Sago Benefits: స‌గ్గు బియ్యం తరచూ తీసుకుంటే మీ శరీరంలో జరిగేది ఇదే.!

Anil kumar poka

|

Updated on: Oct 27, 2024 | 10:10 AM

సగ్గు బియ్యం, లేదా సబుదానా అంటే అందరికీ తెలిసిందే. కానీ దీనివల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. ఇది ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థం. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది దీనిని రకరకాల వంటలలో వినియోగిస్తారు. సగ్గుబియ్యం తరచూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సహజంగా బరువు తగ్గించటానికి సగ్గు బియ్యం మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సగ్గు బియ్యంలో కొవ్వు పదార్దాలు చాలా తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు తరచుగా సగ్గుబియ్యం వాడటం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. శరీరంలో అధిక వేడి ఉన్నవారు సగ్గు బియ్యాన్ని జావగా కాచుకుని తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం మంచి ఆహారం. సగ్గుబియ్యాన్ని రసాయనాలు లేని న్యాచురల్ స్వీట్ నర్‌గా చెబుతారు.

సగ్గుబియ్యంలో కాల్షియం అధికంగా ఉంటుంది. సగ్గు బియ్యం గ్యాస్ సమస్యలను తక్షణం నివారిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు దూరమవుతాయి. సగ్గుబియ్యంలోని విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. సగ్గు బియ్యం ఫైబర్‌కు మంచి మూలం, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది, ముఖ్యంగా వ్యాధి లేదా వ్యాయామం తర్వాత సగ్గు బియ్యం జావ తీసుకోవడం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఇతర ముఖ్యమైన విటమిన్లను అందిస్తుంది. అంతేకాదు.. సగ్గుబియ్యంతో ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ముడతలు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.